యూపీ లో మరోసారి కమలం జెండా రేపరెపలు ఆడించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంది. ఈ సారి ఏకంగా 350 సీట్లు గెలుచుకోవాలని కమలనాథులు పటిష్టమైన వ్యూహాలు రచిస్తున్నారు. జన్ విశ్వాస్ యాత్ర పేరిట మళ్ళీ అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా యోగి నేతృత్వంలోని ఆ రాష్ట్ర పార్టీ  అడుగులు వేస్తుంది.  

2022 లో జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత రసవత్తరంగా మారింది. మళ్ళీ అధికారం మాదే నంటూ కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రాజధాని ఢిల్లీ నుంచి ఎన్నికల ప్రచారం నిమిత్తం జాతీయ నాయకులు ఆ రాష్ట్రంలో పాగా వేశారు. 

వచ్చే ఏడాది జరగబోయే 5 రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ , పంజాబ్ , మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో  ముఖ్యమైన ఉత్తరప్రదేశ్  రాష్ట్రంలో మరోసారి  అధికారమే లక్ష్యం గా పావులు కదుపుతున్న బీజేపీ జాతీయ అధినాయకత్వం ఉత్తరప్రదేశ్ లో జన్ విశ్వాస్ యాత్ర కు శ్రీకారం చుట్టింది. 

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ తన ప్రచార పర్వాన్ని ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి 150 మందికి నేతలను ఈ రెండు రాష్ట్రాలకు పంపించింది. వందమంది కి పైగా సీనియర్ నేతలు, కార్యనిర్వాహకులు పశ్చిమ యూపీ లో ఉన్న 44 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల భాద్యులుగా జాతీయ అధిష్టానం నియమించింది. వీరంతా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార భాద్యతలు నిర్వర్తించనున్నారు.  

ఢిల్లీకి దగ్గర్లోని పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో అధిక సంఖ్యలో రైతులు ఉన్నారు . జాట్ సామాజిక వర్గం వారు అధిక సంఖ్యలో రైతులుగా ఉన్నారు , తొలి నుంచి బీజేపీ కి మద్దతుదారులు గా ఉన్న ఈ ప్రాంతంలో ని రైతులు  వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టిన తరువాత నుంచి కేంద్రం మీద ఈ ప్రాంతానికి చెందిన వారే మొదట తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన పంజాబ్, రాజస్థాన్ మరియు హర్యానాల పార్టీ నేతలను అధిక సంఖ్యలో నియోజకవర్గ ఎన్నికల భాద్యులుగా నియమించారు. ఈ 44 నియోజకవర్గాల్లో ప్రస్తుతం 50 రోజులు , మళ్ళీ ఎన్నికల కు ముందు రెండు నెలలు ఇక్కడే ఉండి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారు అని ఆ పార్టీ సీనియర్ నేత తెలియజేశారు. 

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జన్ విశ్వాస్ యాత్రకు శ్రీకారం చుట్టింది. యూపీ లోని అంబేద్కర్ నగర్ నుంచి ఈ యాత్ర ను జాతీయ పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా , కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లు జెండా ఊపి ప్రారంభించారు. 

యూపీ లోని పలు సెగ్మెంట్లలో పార్టీకి చెందిన జాతీయ స్థాయి నాయకులు, పలువురు కేంద్ర మంత్రులు ప్రచారం చేయడానికి దిగబోతున్నారు. అలాగే , జన్ విశ్వాస్ యాత్ర రాష్ట్రంలో ని మరో 6 కీలకమైన ప్రాంతాల నుంచి ప్రారంభమైంది . ఈ యాత్ర లు క్షేత్రస్థాయిలో ఉన్న  పార్టీ కార్యకర్తలకు మరింత  ఉత్సాహాన్ని కలిగించింది. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ  మిషన్ 350 ప్లస్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షణ భాద్యతలు చేపట్టగా ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ సైతం ఎన్నికల గోదాలో పార్టీని మరోసారి విజయం వైపు నడిపించాలని మరింత పట్టుదలతో ఉన్నారు. 

2024 లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడంలో 80 లోక్ సభ స్థానాలు కలిగి ఉన్న ఉత్తరప్రదేశ్ లో మెజారిటీ సీట్లు సాధించాలంటే  2022లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కశ్చితంగా గెలవాలి. అది దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో పార్టీ తరుపున పోటీ చేయబోయే అభ్యర్థుల కోసం ఒక సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సారి అసెంబ్లీ టికెట్లలో  యువతకు పెద్దపీట వేయడమే కాకుండా  నేర చరిత్ర, వివాదాస్పద వాఖ్యలు చేసేవారికి  , అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పార్టీ టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని పార్టీ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: