రోజూ పళ్ళు తోమే పేస్ట్ కోసం అంత డిమాండ్ ఏమిటి అనే సందెహాలు రావడం సహజం.. కొల్గెట్ పేస్ట్ దానికి సంబంధించిన ఉత్పత్తుల ను కొనుగొల్లు చేయడానికి జనాలు కిరణా స్టోర్ లలో వరుసలు కడుతున్నారు. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. మరి కొద్ది రోజుల్లో అక్కడ ఆ కంపెనీ వస్తువులను సరఫరాను నిలిపి వేస్తున్నట్లు తెలుస్తున్నారు. ఆ రాష్ట్రంలో ఇప్పుడు జనాలు స్టోర్ ల వద్ద గుమిగూడి వున్నారు.


ఆ రాష్ట్రం వ్యాప్తంగా కోల్గేట్‌ ఉత్పత్తుల పంపిణీ నిలిపివేయాలని డిస్ట్రిబ్యూటర్స్‌ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1వ తేదీ నుంచి పేస్ట్‌లు, ఇతర ఉత్పత్తుల ను దశల వారీగా పంపిణీ ఆపేయనున్నారు. ఈ రోజు నుంచి అక్కడ కొల్గెట్ సంబంధిత మ్యాక్స్‌ ఫ్రెష్‌ పేస్ట్‌ల ఉత్పత్తిని ఆపేశారు. వారం తర్వాత వేదశక్తి పేస్ట్‌ను సైతం పంపిణీ నిలిపివేయాలని డిసైడ్ చేశారు.. ఆర్గనైజ్డ్‌ ఛానెల్‌ అంటే జియో మార్ట్‌, మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ, ఉడాన్‌, ఎలాస్టిక్‌ రన్‌ లాంటి కామర్స్‌ బీ2బీ కంపెనీల కు మరో రేట్లు ఉంటోంది. అయితే పూణే లో జరిగిన ఒక ఉత్పత్తి లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ తన ఉత్పత్తులను అన్ని ఛానెల్‌లలో ఒకే ధరకు విక్రయించినట్లు తెలిపింది.


ఈ వార్తలో నిజం లేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఈ విషయం పై తాజాగా కోల్గేట్‌ పాల్మోలైవ్‌ ఇండియా, పంపిణీదారుల చర్యలపై స్పందించింది. పంపిణీ దారులతో ఎనిమిది దశాబ్దాలుగా బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. అంతే కాదు అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్‌ నెట్‌వర్క్‌ తో సంప్రదింపులు జరుపుతామని, సవాళ్లను అధిగమిస్తామని ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అంతే కాదు ఆ రాష్ట్రం లో ఈ ఉత్పత్తుల పై ఎటువంటి అంతరాయం కలగకుండా చూస్తామని కంపెనీ పేర్కొన్నారు.. రాష్ట్రం లోని ప్రజలు ఎటువంటి అఫొహలు పెట్టుకోవద్దని సూచించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: