ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత... అభివృద్ధి మాత్రమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు  జిల్లా కలెక్టర్ శ్రీకేష్. జలవనరుల ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యమన్నారు జిల్లా కలెక్టర్ శ్రీకేష్. జిల్లాలో సాగునీటి వనరుల ప్రాజెక్టులు పూర్తి కావడం వలన జిల్లా సస్యశ్యామలం అవుతుందని, ప్రతి ఎకరాకు నీరు అందుతుందని అన్నారు. 2022 సంవత్సరంలో జిల్లాకు అంతా శుభం జరగాలని ఆయన కోరారు. వంశధార,  ఆఫ్ షోర్, హైలెవల్ కెనాల్ నిర్మాణం పూర్తి కాగలవని, నెరేడిద బ్యారేజీ నిర్మాణానికి ఈ ఏడాది అడుగులు పడగలవని ఆశిస్తున్నట్లు కలెక్టర్ శ్రీకేష్ తెలిపారు. 2021 సంవత్సరంలో కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగిందని, హెల్త్ వర్కర్ లు, రెవెన్యూ, పోలీస్ ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లు మానవతావాదంతో మంచి సేవలు అందించారని పేర్కొన్నారు.

వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మంచి సేవలు అందించారని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ శ్రీకేష్. నూతన సంవత్సరంలో కోవిడ్ జిల్లాలో ఎక్కువగా వ్యాప్తి కాకుండా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, నిబంధనలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ శ్రీకేష్ కోరారు. రెండవ దశ సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగిందని, మూడవ దశను పకడ్బందీగా ఎదుర్కునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. గృహ నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నామన్న కలెక్టర్... లక్షా ఇరవై వేల పట్టాలను పంపిణీ చేశామని, మొదటిదశ నిర్మాణంలో భాగంగా 96 వేల గృహాలను మంజూరు చేశామని చెప్పారు. 2022 సంవత్సరంలో వీటిని పూర్తి చేయుటకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. దాదాపు 7 వేల 400 మంది లబ్ధిదారులు నూతనంగా పింఛను కానుక పొందారని తెలిపారు. దీంతో జిల్లాలో అన్ని రకాల పించన్లు క్రింద 7.22 లక్షల మంది పొందుతున్నారని కలెక్టర్ వివరించారు. వ్యవసాయం గురించి మాట్లాడుతూ 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా ఇప్పటికే 20 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా మేలు చేయాలని కృషి చేస్తుందని, 21 రోజుల్లోనే బిల్లులు చెల్లించుటకు ఏర్పాటు చేశారని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: