తెలంగాణ రాజ‌కీయాల్లో తిరుగులేని నేత‌గా పేరున్న కేసీఆర్ ఇప్పుడు పంథా మార్చి దేశ రాజ‌కీయాల్లో స్థిరం కావాల‌ని,అదేవిధంగా  అక్క‌డ కూడా  మంచి పేరు తెచ్చుకోవాల‌ని ప‌రిత‌పిస్తున్నారు.ఇదే సంద‌ర్భంలో త‌న‌తో క‌లిసి వ‌చ్చే భావ సారూప్య‌త ఉన్న పార్టీల నాయ‌కుల‌తో ప‌నిచేసేందుకు సిద్ధం అవుతున్నారు.ఈ క్ర‌మంలో ఢిల్లీ కేంద్రంగా రాజ‌కీయాలు న‌డిపేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.ఎన్నిక‌లు చాలా దూరం ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి నుంచే త‌నదైన చాక‌చ‌క్యంతో దేశ రాజ‌కీయాల్లో నెగ్గుకు రావాల‌ని  ప‌రిత‌పిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ప్ర‌శాంత్ కిశోర్ ను రంగంలోకి దింపారు.ఆయ‌న అయితేనే ఢిల్లీ రాజ‌కీయాల్లో త‌న‌కు  సాయంగా ఉంటార‌ని ప్ర‌గాఢంగా న‌మ్ముతున్నారు.గ‌తంలో విజ‌య‌శాంతి లాంటి లీడ‌ర్లు ఢిల్లీ కేంద్రంగా రాజ‌కీయాలు న‌డిపినా  నెగ్గుకు రాలేక‌పోయారు.సొంతంగా పార్టీలు పెట్టి నెగ్గుకు రావాల‌నుకున్న అలే న‌రేంద్ర లాంటి వారికీ ఇలాంటి క‌ల‌లు సాధ్యం కాలేదు. ఇంకా చాలా మందికి  సొంత పార్టీల‌ను నిలుపుకునే శ‌క్తే లేకుండా పోయింది. ప్రొఫెసర్ కోదండ‌రాం (టీఆర్ఎస్ వ్యూహ‌క‌ర్త‌ల్లో ఒక‌రుగా చెప్పుకుంటారు. ప్రొఫైసర్ జ‌య‌శంక‌ర్ త‌రువాత కేసీఆర్ ను లీడ్ చేసింది ఈయ‌నే) ఆ విధంగా రోజు సిద్ధాంత క‌ర్త‌లు, వ్యూహ‌క‌ర్త‌లు పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పే మాస్టార్లు కావ‌డం కేసీఆర్ కు ఎంత‌గానో క‌లిసి వ‌చ్చింది. కానీ ఇప్పుడు కార్పొరేట్ శ‌క్తుల నీడ‌ల్లో కేసీఆర్ వెళ్లిపోవ‌డ‌మే పెద్ద వివాదానికి దారి ఇస్తుంది.

వాస్త‌వానికి  తెర‌వెనుక టీఆర్ఎస్ చాలా మంది నిపుణులు ప‌నిచేశారు.వారంతాతెలంగాణ వృద్ధిని కోరుకునే చేశారు.అప్పుడు వారు టీఆర్ఎస్ ఉద్య‌మ పార్టీగా ఉన్న‌ప్పుడు నిస్వార్థంగా సేవ‌లు అందించారు.తెలంగాణ ఏర్పాటు అయ్యాక కూడా సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగ సంబంధ స‌మ‌స్య‌లు వీట‌న్నింటిపై కూడా కేసీఆర్ తో క‌లిసి ప‌నిచేశారు.ఆ స్థాయి జ్ఞానం పీకేకు ఉందో లేదో  తెలియ‌దు కానీ తెలంగాణ ఆత్మ వారికి తెలిసిన విధంగా పీకేకు తెలియ‌దు.ఆ మాట‌కు వ‌స్తే కేసీఆర్ కు తెలిసినంత కూడా
పీకే కు తెలియ‌దు.తెలంగాణ ఆత్మ తెలిసిన నేత‌గా జాతీయ రాజ‌కీయాల్లో రాణించాల‌నుకోవ‌డం మంచి విష‌య‌మే కానీ..పీకే ను నమ్ముకోవ‌డం మాత్రం ఓ విధంగా సాహ‌స‌మే అని చెప్పాలి. అస్స‌లు స్థిర‌త‌తో కూడిన నిర్ణ‌యాలు ఆయ‌న ఇవ్వ‌డని కూడా అంటారు.విప‌రీతంగా డ‌బ్బు గుంజుకుపోయే మ‌నిషిగా కూడా పేరుంద‌ని అంటారు.ఇవే కాకుండా కోట్లు వెచ్చించి స‌ల‌హాల కోసం ప‌డిగాపులు కాయాల్సిన అవ‌స‌రం ఇవాళ కేసీఆర్ కు ఏమొచ్చింద‌ని కూడా కొంద‌రి పెద‌వి విరుపు.కేసీఆర్ ఆ రోజు ప‌నిచేసిన విధంగా స‌బ్జెక్ట్ ఎక్స్‌పెర్ట్స్ తో ప‌నిచేస్తే చాలు.ఆయ‌న అనుకున్న ఫ‌లితాలు వ‌స్తాయి.రాకున్నా పీకేకు చెల్లించే కోట్లు మిగులుతాయి. ఏ విధంగా చూసుకున్నా పీకే లాంటి ఓ స్వార్థ జీవి చ‌క్రంలో కేసీఆర్ జీవితం ఇరుక్కుపోవ‌డమే విచార‌క‌రం.



మరింత సమాచారం తెలుసుకోండి: