ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక కూరుకుపోయిన సంగతి తెలిసిందే.ఇప్పుడు శ్రీలంకలో పరిస్థితి చేయిదాటిపోయింది. కష్టాలు కన్నీళ్లు భరించలేని ఆకలి విద్యుత్ కొరతతో చీకట్లు చూసి అక్కడి ప్రజలు రోడ్డెక్కారు.ఏకంగా అధ్యక్ష భవనంపై ప్రజలు దాడి చేశారు. ఆహార పదార్థాలు నిత్యావసర సరుకులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరతతో అల్లాడిపోతున్న ప్రజల్లో ఈ మేరకు కోపం ఉగ్రరూపం దాల్చింది. ఏకంగా శ్రీలంక అధ్యక్షుడి నివాసం మీదకే దండెత్తేలా చేసింది. అక్కడి పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టేలా చేసింది. అలాగే ప్రభుత్వ బస్సులను తగుల బెట్టేలా చేసింది. ఇంకా పోలీసులపై రాళ్లు రువ్వారు.కడుపు కాలిన ప్రజలు చిన్నారులు మహిళలు కూడా ఈ ఆందోళనలో పాలుపంచుకోవడం విశేషం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.ఇక దేశభక్తి అంటే రాజకీయ నాయకులను గుడ్డిగా నమ్మడం కాదని.. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు గొంతెత్తడమంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించారు. అధ్యక్షుడు తక్షణం తప్పుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేశారు.



కరోనా వైరస్ కల్లోలంతోపాటు శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అక్కడి ప్రజలను అంధకారంలోకి నెట్టేశాయి. ఆ దేశ స్వతంత్ర్య చరిత్రలోనే మొదటిసారిగా తీవ్ర సంక్షోభంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. నిత్యవసర వస్తువులు కొనుక్కునేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి అనేది నెలకొంది. గతంలో అసలు ఎప్పుడూ లేనంతగా దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఆహారం చమురు విద్యుత్ సంక్షోభంతో శ్రీలంక దేశం కుదేలవుతోంది.దీంతో వేలాది మంది ప్రజలు వేరే ప్రాంతలకు వలస వెళుతున్నారు. నిరంతర విద్యుత్ కోతలు పెరుగుతున్న నిత్యావసర ధరలతో ప్రజలు బాగా అల్లాడుతున్నారు. విద్యుత్ కొరతతో రాత్రివేళ స్ట్రీట్ లైట్లను కూడా ఆన్ చేయని పరిస్థితి అక్కడ నెలకొంది. ఇంధన కొరతతో ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోతున్నాయి. తినడానికి తిండి లేక ఇంకా వంట చేసుకోవడానికి గ్యాస్ లేక.. ఇంట్లో ఉందామంటే కరెంట్ లేక నిత్యావసరాలను ఆకాశాన్ని అంటిన వేళ శ్రీలంక ప్రజలంతా ఇప్పుడు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు.



చివరకు చీప్ గా దొరికే ఉప్పు కోసం కూడా అక్కడి ప్రజలు గంటల కొద్దీ క్యూలో నిలుచునేలా పరిస్థితి శ్రీలంకలో ఏర్పడింది. అలా గంటల తరబడి వేచి ఉన్నా కూడా దొరకని పరిస్థితి శ్రీలంకలో నెలకొంది. శ్రీలంక ప్రభుత్వం చేసిన అప్పులే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. దీంతో వీటన్నింటిని ఇంతకాలం ఓపికగా భరించిన ప్రజలు అక్కడి ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకునేందుకు నిరసన మార్గాన్ని ఎంచుకున్నారు. నిరసన కారులపై అక్కడి పోలీసులు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. టియర్ గ్యాస్ వాటర్ కెనన్లు కూడా ప్రయోగించారు. ఆ తర్వాత పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. ఇక కోపంతో పోలీస్ ఆర్టీసీ వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. భద్రతా దళాలపై రాళ్లని రువ్వారు. దీంతో శ్రీలంక దేశ రాజధాని కొలొంబోలో కర్ఫ్యూను విధించారు.ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమని ఏకంగా అధ్యక్ష భవనాన్ని ప్రజలు ముట్టడించారు. కొలొంబోలోని అధ్యక్షుడు రాజపక్సే ఇంటి ఎదుట ప్రజలు ఈ ఆందోళనకు దిగారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ నిరసన చాలా హింసాత్మకంగా మారింది. పలువురు ప్రజలు ఇంకా జర్నలిస్టులు గాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: