రైల్వే అప్‌డేట్: రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకునే ముందు irctc కి సంబంధించిన ఈ కొత్త నియమాన్ని ఖచ్చితంగా చెక్ చేయండి. irctc వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే కోట్లాది మంది ప్రయాణికులకు ఈ మార్పు వర్తిస్తుంది.మీరు తరచుగా రైలులో ప్రయాణించి, irctc వెబ్‌సైట్ ఇంకా యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకుంటే, ఈ వార్త మీకోసమే. భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన irctc (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) టిక్కెట్ల బుకింగ్ నిబంధనలను మార్చింది.కొత్త నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత కోట్లాది మంది వినియోగదారులు తమ ఖాతాలను వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.భారతీయ రైల్వే అనుబంధ సంస్థ irctc జారీ చేసిన నిబంధనల ప్రకారం, టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు వినియోగదారులు తమ మొబైల్ నంబర్లు ఇంకా అలాగే ఈ-మెయిల్ IDలను వెరిఫై చెయ్యాల్సి ఉంటుంది. అయితే, కోవిడ్-19 భారతదేశంలోకి (మార్చి 2020) వచ్చినప్పటి నుండి యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోని ప్రయాణికులకు ఈ మార్పు వర్తిస్తుంది. మీరు కూడా ఎక్కువ కాలం టిక్కెట్‌ను బుక్ చేసుకోకుంటే, ముందుగా వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.



మీ మొబైల్ నంబర్ ఇంకా ఇ-మెయిల్‌ను ఎలా  వెరిఫై చెయ్యాలో ఇక్కడ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వండి.వెరిఫై చేసుకోండి.


దశ 1: irctc యాప్ లేదా వెబ్‌సైట్‌కి వెళ్లి, వెరిఫికేషన్ విండోపై క్లిక్ చేయండి. 
దశ 2: ఇక్కడ మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఇంకా అలాగే ఇ-మెయిల్ ఐడిని నమోదు చేయాలి. 
దశ 3: రెండు సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత, వెరిఫై బటన్‌పై క్లిక్ చేయండి.
దశ 4: వెరిఫైపై క్లిక్ చేసిన తర్వాత, మీ మొబైల్‌కు OTP వస్తుంది, దానిని నమోదు చేసి, మొబైల్ నంబర్‌ను వెరిఫై చేసుకోండి.  
దశ 5: అదేవిధంగా, ఈ-మెయిల్ ఐడిలో వచ్చిన కోడ్‌ను నమోదు చేసిన తర్వాత, మీ మెయిల్ ఐడి వెరిఫై చేయబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: