ఒకప్పుడు దూర ప్రాంతాలకు వెళితే అక్కడ ఉండటానికి రూమ్ ల కోసం చాలా కష్టపడేవాళ్ళు..కానీ ఇప్పుడు అలాంటి వాటి గురించి బాధ పడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఒయో రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. సరసమైన ధరలలో దొరుకుతుండటం తో ఎక్కువ మంది వీటి వైపు మొగ్గు చూపిస్తూన్నారు. కస్టమర్లు రోజు రోజుకు పెరగడంతో దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడింది..తన రెగ్యులర్ కస్టమర్ల కోసం ఒక ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఇందులో ఒక కస్టమర్ వారి హోటళ్లలో వరుసగా 5 రోజులు బస చేస్తే, ఆరో రోజున ఉచిత బస ప్రయోజనం పొందుతారు.


దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ఈ ఆఫర్ ప్రధాన లక్ష్యమని కంపెనీ తెలిపింది. విజార్డ్ ప్రోగ్రామ్ కింద oyo విజార్డ్ హోటల్ బుకింగ్‌లపై 10% వరకు తగ్గింపును కూడా పొందవచ్చని ఒయో వెల్లడించింది. ఒయో 9.2 మిలియన్లకు పైగా సభ్యులతో, ఒయో విజార్డ్ దేశంలోని ప్రముఖ ట్రావెల్, ఫుడ్ బ్రాండ్‌లచే నిర్వహించబడే అతిపెద్ద లాయల్టీ ప్రోగ్రామ్‌లలో ఒకటి. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ఒయో లాయల్టీ ప్రోగ్రామ్‌కు ప్రధాన నగరాలు.13 కంటే ఎక్కువ కంపెనీలతో టై-అప్‌లు ఒయో విజార్డ్‌లో ప్రస్తుతం 3 తరగతులు ఉన్నాయి. విజార్డ్ బ్లూ, విజార్డ్ సిల్వర్, విజార్డ్ గోల్డ్. గోల్డ్ సభ్యులు మాత్రమే ఒయో  లో 5 బసలపై ఒక ఉచిత బస ప్రయోజనాన్ని పొందుతారు.

 

సిల్వర్ సభ్యులు ఏడో బస తర్వాత, బ్లూ సభ్యులు ఎనిమిదో బస తర్వాత ఉచిత బసను పొందుతారు. ఇది కాకుండా, ఒయో తన విజార్డ్ క్లబ్ సభ్యుల కోసం 13కి పైగా టాప్ కంపెనీల నుంచి డిస్కౌంట్ కూపన్‌లు, వోచర్‌లను కూడా అందిస్తోంది.అంతేకాదు ఎన్నో ఆఫర్లను కూడా ప్రకటిస్తుంది.ప్రయాణమే కాకుండా ప్రజలు ఏదైనా వ్యాపారం, ఇతర అవసరాల కోసం ఓయో నుంచి గదులను బుక్ చేసుకోవడానికి ఇష్టపడతారు..మంచి సదుపాయాలు ఉండటంతో ఒయో బ్రాండ్ రోజు రోజుకు పెరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: