కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉన్నతాధికారులు రెండురోజు కూడా చాలా గంటలపాటు విచారించారు. మొదటిరోజు పదిగంటలు విచారించారు. మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ మధ్యాహ్నం నుండి రాత్రివరకు సెకండ్ రౌండ్ విచారించారు. అలాగే రెండోరోజు కూడా విచారించారు. అయితే రెండోరోజు లంచ్ బ్రేక ఇవ్వలేదు. లంచ్ ను ఈడీ ఉన్నతాధికారులే తెప్పించి విచారణ కంటిన్యు చేశారు. రెండోరోజు కూడా సుమారు 10 గంటల విచారణ జరిగింది.





మొదటిరోజు విచారణకు రెండోరోజు విచారణకు బాగా తేడా ఉంది. ఎలాగంటే మొదటిరోజు ఢిల్లీలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అరెస్టుచేసిన పోలీసులు పలానా పోలీసుస్టేషన్ అనికాకుండా వరుసగా ఢిల్లీలోని అన్నీ పోలీసుస్టేష్టన్ల చుట్టూ తిప్పుతున్నారు. దాంతో తమ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడుంచారో కూడా ఎవరికీ తెలీటంలేదు. ప్రముఖులను అరెస్టుచేసేముందు ఈడీ, సీబీఐ లాంటి సంస్ధలు ఇలా చేయటం మామూలే.






రాహుల్ ను అరెస్టుచేస్తే తర్వాత పరిణామాలు ఎలాగుంటాయో అంచనావేయలేనంత అమాయకులు కాదు ఉన్నతాధికారులు. పైగా ఈ మొత్తం ఎపిసోడ్ ను కేంద్రప్రభుత్వంలోని పెద్దలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. ఒకపుడు జగన్మోహన్ రెడ్డిని కూడా వరుసగా మూడు నాలుగురోజులు విచారణ పేరుతో పిలిపించుకుని చివరలో అరెస్టని ప్రకటించారు. ఏమంటే తమ విచారణకు జగన్ సహకరించలేదని దర్యాప్తు అధికారులు ప్రకటించారు.





ఇపుడు రాహుల్ విషయంలో కూడా ఈడీ అధికారులు ఇదే చెబుతున్నారు. తమ విచారణకు రాహుల్ సహకరించటంలేదంటున్నారు. అవసరమైతే మరో రోజో లేకపోతే రెండురోజులు విచారణ అంటు తమ కార్యాలయానికి పిలిపించుకుని చివరకు అరెస్టంటారేమో అనే అనుమానాలను కాంగ్రెస్ నేతలు వ్యక్తంచేస్తున్నారు. రాహుల్ విచారణకు వచ్చినపుడు మొదటిరోజు కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. అలాంటిది అరెస్టంటే ఎలా స్పందిస్తారో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా రాహుల్ ను విచారించటం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చేదే అని చెప్పుకుంటున్నారు. అలాంటిది ఏకంగా అరెస్టంటే పరిస్ధితి ఇంకెలాగుంటుందో అర్ధం కావటంలేదు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: