వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మీద పీకల్దాక ఎంపీలో కోపం పేరుకుపోయింది. అయితే దాన్ని ఎలా తీర్చుకోవాలో ? ఎప్పుడు తీరుతుందో మాత్రం తెలీటంలేదు. అందుకనే ఇంట్లోకూర్చుని ప్రతిరోజు రచ్చబండ పేరుతో మీడియాసమావేశం నిర్వహిస్తు జగన్ పై బురద చల్లేస్తు తనలోని కోపాన్ని చల్లార్చుకుంటుంటారు. ఇపుడిదంతా ఎందుకంటే జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తు నిరసన తెలిపారట.






ఇంతకీ ఎంపీ తన నిరసనను ఏరూపంలో తెలిపారు ? ఏ రూపంలో అంటే ఢిల్లీలోని తనింట్లో కూర్చుని నిరసన తెలిపారట. ఇంట్లో కూర్చుని నిరసన తెలియజేయటం ఏమిటంటే మరదే ఎంపీగారి స్టైల్. సొంత నియోజకవర్గమైన నరసాపురంలోకి అడుగుపెట్టలేరు. సొంతజిల్లా భీమవరంలో తిరగలేరు. చివరకు హైదరాబాద్ కు కూడా రావాలంటే ఎప్పుడేం జరుగుతుందో అని భయపడుతున్నారు. మళ్ళీ తనంతటి ధైర్యవంతుడు లేడని మీడియా సమావేశాల్లో చెబుతుంటారు. అందరినీ జగన్ ప్రభుత్వంపై ధైర్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చే ఎంపీ మాత్రం ఢిల్లీ వదిలిరారు. మరి రేపు ఎన్నికల్లో పోటీచేయాలంటే ఏమిచేస్తారో చూడాలి.





ఎంపీ నిజంగానే అంతటి ధైర్యవంతుడైతే మరి నరసాపురంకు రావచ్చుకదా అంటే వచ్చి సీఐడీ అధికారుల దగ్గర దెబ్బలు తినటానికి తానేమన్నా వెర్రిపుష్పాన్ని అంటు ఎదురు ప్రశ్నవేస్తారు. మొత్తానికి రాజుగారు తన  విచిత్రమైన వైఖరితో ఢిల్లీలో కూర్చుని  ప్రతిరోజు మీడియా సమావేశాల్లో జగన్ పై  ధైర్యంగా ఆరోపణలు చేస్తుంటారు. బెయిల్ రద్దుచేసి జగన్ను ఎలాగైనా జైలుకు పంపాలన్న ప్రయత్నాలు వరుసగా ఫెయిలవుతున్నాయి. ఆ ఉక్రోషం రాజుగారిలో బాగా పెరిగిపోతోంది.





రాజుగారు మాత్రం ఢిల్లీ వదిలి ఏపీలోకి అడుగుపెట్టరట. కానీ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేకించి సీఐడీపై ప్రైవేటుకేసులు వేసే వాళ్ళుంటే వాళ్ళ లాయర్ ఫీజులను తానే భరిస్తానంటు బంపర్ ఆఫర్ మాత్రం ఇచ్చారు. ఢిల్లీలో కూర్చుని ఏపీలో జనాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. అయితే ఎంపీగారి పిలుపువిని మాయలో పడే జనాలు ఎవరున్నారో అర్ధం కావటంలేదు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: