తిరుమల పుణ్యక్షేత్రంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయానికి సమీపంలోని బూందీ పోటులో ఈ అగ్నిప్రమాదం జరిగింది. లడ్డూ ప్రసాదం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడలకు పేరుకుపోయిన నెయ్యి మరకలకు నిప్పు అంటుకోవడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. 

                    

అయితే సమాచారం అందుకున్న మూడు అగ్నిమాపక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. మంటలు అదుపు చేసే సమయంలో ఓ కార్మికుడికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా ఈ అగ్ని ప్రమాదంలో ఒక్క కార్మికుడికి తప్ప మిగితా ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. 

                              

ఈ ఘటనతో లడ్డు తయారీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే గతంలో కూడా చాలాసార్లు బూంది పోటులో మంటలు చెలరేగాయి. గత ఏడాది మార్చిలో చివరిసారిగా బుంది పోటీలు అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు ఏంటి అనేది మంటలు చల్లారితే కానీ చెప్పలేము. 

                                      

కాగా ఈరోజు ఉదయం నుండి అగ్నిప్రమాదాలు గురించి వింటూనే ఉన్నాం. ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగి 43 మంది అక్కడిక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఘోర అగ్ని ప్రమాదం కావడంతో 43 మంది మృతి చెందగా 50 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ప్రస్తుతం వారిని చికిత్సనిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: