ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో  ప్రతిపక్ష టీడీపీ పార్టీ కంటే అధికార పార్టీపై ఎక్కువ విమర్శలు చేస్తున్నా పార్టీ ఏది అంటే జనసేన పార్టీ . జనసేన పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్... ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ వెళ్లి పెద్దల తో మాట్లాడిన పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి నడవడానికి నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అధికార పార్టీ తీరుపై పోరాటం చేసేందుకు బిజెపి జనసేన పార్టీలు సమిష్టిగా కార్యాచరణను రూపొందిస్తామని అంటూ ప్రకటించారు. అయితే బిజెపి జనసేన పార్టీలు రెండు విజయవాడలో  అమరావతి కోసం లాంగ్ మాత్రం చేపట్టడానికి ప్రకటించారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ బిజెపికి దూరంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. 

 

 

 బిజెపి జనసేన పార్టీలు కలిసి ప్రకటించిన లాంగ్ మార్చ్ కూడా వాయిదా పడింది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ కర్నూలులో  పర్యటించి... అత్యాచార బాధితురాలు ప్రీతి కోసం గళం విప్పారు. అయితే కర్నూలు పర్యటనలో బీజేపీ శ్రేణులు ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త చర్చ మొదలైంది. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ అమరావతి లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అయిన  జనసేన వెంట బీజేపీ నేతలు ఉంటారా లేదా అన్నది కూడా సందేహంగా మారింది. ప్రస్తుతం బిజెపి జనసేన పార్టీ ల మధ్య ఉన్న తీరు చూస్తుంటే  ఈ రెండు పార్టీలు   కలిసి నడిచేందుకు నిజంగానే పొత్తు కుదిరిందా అనే సందేహాలు కూడా ఆంధ్ర రాజకీయాల్లో మొదలైనట్లు తెలుస్తోంది. కాగా  ఈ పొత్తు  కి ఆదిలోనే అంతరాయం  ఏర్పడుతుందా  అని అనుకుంటున్నారు. 

 

 

 

 అంతేకాకుండా గత కొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావాలని బిజెపి పార్టీకి దూరంగా ఉంటున్నట్లు ఓవైపు ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు... గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో బిజెపి పార్టీ కేంద్రం ప్రాధాన్యత ఇస్తూ సానుకూలంగా వ్యవహరించటం పవన్ కళ్యాణ్ కు అంతగా నచ్చడం లేదని... ఈ కారణంగానే బిజెపితో పొత్తుకు సంబంధించి కాస్త దూరంగానే ఉంటున్నారు అంటూ ఆంధ్ర రాజకీయాల్లో పలువురు చర్చించుకుంటున్నారు. కారణం ఏదైనప్పటికి అధికార పార్టీని ఎదిరించడానికి మొన్నటికి మొన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంతలోనే పొత్తునుంచి కొంచెం కొంచెం దూరం జరుగుతున్నట్లు మాత్రం ఆంధ్ర రాజకీయాల్లో  చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: