ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ మహిళలందరికీ వంట చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అప్పట్లో కట్టెల పొయ్యితో వండుకున్న మహిళలందరూ గ్యాస్ వచ్చిన తర్వాత ఎంతో సులభంగా చిటికెలో వంట చేస్తున్నారు. ఎలాంటి కష్టం లేకుండానే గ్యాస్ పై అతి త్వరగా వంటలు కానిచ్చేస్తున్నారు. వంటలు సులభంగా చేసుకోవచ్చు కానీ గ్యాస్ సిలిండర్ విషయంలో మాత్రం ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. గ్యాస్ సిలిండర్ విషయంలో కొంచెం అజాగ్రత్తగా  ఉన్నా ప్రాణాలు సైతం పోతూ ఉంటాయి. ఇక కొన్ని కొన్ని సార్లు అప్రమత్తంగా ఉన్నప్పటికీ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఇంట్లో వాళ్ళందరూ గ్యాస్ సిలిండర్ విషయంలో అప్రమత్తంగానే ఉన్నారు... కానీ వాళ్లు చేసిన ఒక తప్పు వల్ల గ్యాస్ సిలిండర్ పేలింది. 

 

 

 ఇంకేముంది ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది... ఇంట్లోని ఇద్దరు ముసలి వాళ్ళు ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు... ఇల్లు మొత్తం చిందరవందర అయిపోయింది.. ఇంటి గేటు దగ్ధమైంది..  కిటికీలు అద్దాలు పైకప్పు కూడా ముక్కలు ముక్కలు అయింది.. ఇక బయట మొక్కలు కార్లు కూడా ధ్వంసమయ్యాయి. ఇక పక్కింటి కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయి. ఇలా సిలిండర్ పేలుడుతో  జరిగి తీవ్ర నష్టం జరిగింది. హైదరాబాద్ మలక్ పేట్ లోని వెంకటాద్రి నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రజలు అందరూ భయాందోళనకు లోనై పరుగులు పెట్టారు. 

 

 

 వెంటనే బాంబు స్క్వాడ్ బృందాలు ఇంటికి వచ్చి పరిశీలించగా.. గ్యాస్ సిలిండర్ పక్కనే ఫ్రిడ్జ్ ఉండటం చూసి... ఈ తప్పు ప్రమాదానికి కారణం అయిందని తెలిపారు.అలా పెట్టవద్దు అని చెప్పారు. పేలుడుకు ఇదే కారణం అంటూ తెలిపారు. కనీసం పది అడుగుల దూరం లో గ్యాస్ సిలిండర్ కి ఫ్రిజ్ కి దూరం ఉండాలని సూచించారు. ఎందుకంటే ఫ్రిడ్జ్ దానంతట అదే ఆన్ అవుతూ  ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ లీక్ అయిన వెంటనే అదే సమయంలో ఫ్రిజ్  కూడా ఆన్ అయింది. ఇక ఫ్రిజ్  నుంచి ఆక్సిజన్ రిలీజ్ అవడంతో గ్యాస్ ఆక్సిజన్ కలవడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సిలిండర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. సిలిండర్ పేలుడు అంటే దాదాపు బాంబు పేలినట్లు. అంతే తీవ్రత ఉంటుంది. అందుకే సిలిండర్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: