జగన్మోహన్ రెడ్డితో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటి అవటాన్ని పచ్చమీడియా అస్సలు తట్టుకోలేకపోతోందా ?  చూస్తుంటే ఆ విషయం అందిరికీ అర్ధమైపోతోంది. ఎందుకంటే చంద్రబాబునాయుడుకు రిలయన్స్ కు ఉన్న సంబంధాలు అందరికీ తెలిసిందే.  పచ్చమీడియాలో దృష్టిలో ముఖేష్ భేటి అయితే చంద్రబాబుతో మాత్రమే భేటి అవ్వాలి. అంతేకానీ చంద్రబాబుతో పాటు తమకు కూడా బద్ధశతృవైన జగన్మోహన్ రెడ్డితో భేటి అవ్వటమేంటనేది వాళ్ళ ఆలోచనగా ఉంది.

 

కానీ ముఖేష్ తరపున ఓ విషయం స్పష్టమైపోతోంది. ఏమిటంటే అధికారంలో చంద్రబాబున్నా జగన్ ఉన్నా ఒకటే. అధికారంలో ఎవరున్నారన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే తన వ్యాపార ప్రయోజనాలే ముఖేష్ కు ముఖ్యమన్న విషయం స్పష్టమైపోయింది. నిజానికి ఏ పారిశ్రామికవేత్త అయినా చూసుకునేది ముందు తన ప్రయోజనాలే అన్న విషయాన్ని చంద్రబాబు, పచ్చమీడియా మరచిపోయింది. అందుకనే వీళ్ళ భేటి కథనంతో పాటు పాత గొడవలను కూడా ప్రముఖంగా అచ్చేసింది.

 

అలాగే జగన్ –చంద్రబాబు మధ్య వైరముంటే ముఖేష్ కు ఏమిటి సంబంధం ? వీళ్ళ మధ్య రాజకీయవైరం ఎప్పటికీ పోయేది కాదు. అందుకని చంద్రబాబు కోసమని తాను కూడా జగన్ తో వైరం పెట్టుకుంటే నష్టపోయేది తానే అన్న విషయం ముఖేష్ కు బాగా తెలుసు. పైగా ఇప్పటికే వివిధ కారణాల వల్ల జగన్ తో రిలయన్స్ అధిపతికి బాగా గ్యాప్ ఉంది.  సరే ఇపుడు ఎలాగూ అవసరం వచ్చింది కాబట్టి ముందు ముఖేషే ఓ అడుగు ముందుకేసి జగన్ తో భేటి కోసమని అమరావతికి వచ్చాడు. దీన్నే చంద్రబాబు, పచ్చమీడియా తట్టుకోలేకపోతున్నారు.

 

ముఖేష్ వ్యక్తిగత ప్రయోజనాన్ని జగన్ నెరవేర్చి జగన్ కోరినట్లు రాష్ట్రంలో రిలయన్స్ కొత్తగా పెట్టుబడులు పెట్టినా లేదా వ్యాపార విస్తరణకు పెట్టుబడులు కుమ్మరిస్తే సిఎం రేంజి ఓ స్ధాయిలో పెరిగిపోవటం ఖాయం.  అధికారంలో ఉన్న వాళ్ళకు దగ్గరవుదామని ఎవరైనా ప్రయత్నిస్తారు కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళ సంగతిని ఎవరు పట్టించుకుంటారు ? ఇంతచిన్న లాజిక్ ను కూడా పచ్చమీడియా మరచిపోయి పాత గొడవలను మళ్ళీ అచ్చేసి తృప్తి పడుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: