ఓ వైపు దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజు కీ తన ప్రతాపాన్ని చూపిస్తుంది.  ఈ నేపథ్యంలో అన్ని రాష్టాలు లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే.  అయితే లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకులు, మెడికల్ షాపులు తప్ప అన్నీ బంద్ చేయాలని సూచించిన విషయం తెలిసిందే.  ముఖ్యంగా మద్యం షాపుల విషయంలో అన్ని రాష్ట్రాలు కట్టడి చేశాయి.  కానీ అక్కడక్కడ కొంత మంది మద్యం సరఫరా చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు.  కరోనా వైరస్ కారణంగా ప్రకటించిన లాక్ డౌన్ నుంచి ఈశాన్య రాష్ట్రాలు ఊరట పొందనున్నాయి.టి నుంచి నిబంధనలను అసోంతో పాటు మేఘాలయ కూడా సవరించనుంది. ఇందులో భాగంగా, మద్యం షాపులు తెరచుకున్నాయి. వీటితో పాటు హోల్ సేల్ వేర్ హౌస్ లు, బాట్లింగ్ ప్లాంట్లు, డిస్టిలరీస్, బ్రేవరీస్ ను రోజుకు 7 గంటల పాటు తెరచుకునేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించాయి.

 

అయితే ఏపిలో మద్యం అమ్మకాలపై దృష్టి సారించాలని చూస్తుంది. అదేంటీ కరోనాని కట్టడి చేయాని గట్టిగా నినదిస్తున్న ఏపి ముఖ్యమంత్రి మద్యం విక్రయాలపై దృష్టి సారించడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా?  అబ్బే మద్యం అమ్మాలంటే  కొంత మంది దొంగ చాటుగా మద్యం అమ్మకాలు చేస్తూ.. ఇల్లీగల్ దందాలు చేస్తున్నవారి భరతం పట్టేందుకు  ప్రత్యేక దృష్టి సారిస్తారట.  రేపటి నుండి రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు,బార్ అండ్ రెస్టాంట్ లలో తనఖీలు చేపట్టనుంది ఎక్సైజ్ శాఖ. తనఖీల కోసం ప్రత్యేకంగా ఎక్సైజ్ అదికారులు, స్దానిక పోలీసులు, అదికారులతో కమిటిలు నియమించనుంది ఏపీ ప్రభుత్వం.  

 

ఈ సందర్భంగా  మద్య విమోచన కమిటి ఛైర్మన్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. గత నెల 22 నుంచి మద్యం దుఖానాల్లో  లెక్కల్లో వ్యత్యాసం ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే నరసరావుపేట,చిలకలూరిపేట మద్యం దుకాణాల్లో వెలుగు చూసిన అక్రమాల పై చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు.  అంతే కాదు  ప్రజా ప్రతినిధులు మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తే వారి జాబితాను ముఖ్యమంత్రి దృష్టిలో పెడతామని వారి పై కూడ చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: