తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొన్ని కొన్ని అంశాల మీద ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో తెలుగుదేశం పార్టీ అతిగా జోక్యం చేసుకుంటుంది అనే భావన చాలా మందిలో ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ పరిణామంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రమేష్ కుమార్ ని ప్రతి దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీని వెనకేసుకువచ్చే పరిస్థితి ఉంది అనే విషయం అర్థం అవుతుంది.

దీనివలన పార్టీ ఎక్కువగా నష్టపోతుంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రజల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఆయన వెనుక ఉంది అనే భావన ఇప్పుడు ఎక్కువగా ఉంది. న్యాయవ్యవస్థ మీద వైసీపీ నేతలు విమర్శలు చేసిన సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు న్యాయవ్యవస్థ వైపు మాట్లాడారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో న్యాయ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వంను ఇబ్బంది పెడుతోంది అనే భావన కొంతమందిలో ఉంది. ఇక మిగిలిన వారిలో కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వెనకేసుకుని రావటం తో కొన్ని కొన్ని అనుమానాలు వస్తున్నాయి.

ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనే అనుమానం చాలామందిలో ఉంది. రమేష్ కుమార్ ని రక్షించుకునే విధంగా వ్యాఖ్యలు చేయడం కూడా చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆలోచించుకోవాలి. కొంతమంది సీనియర్ నేతలు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కాస్త ఎక్కువగా స్పందిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించవద్దు అని చెప్తున్నా సరే నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుగా వెళ్లడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు సమర్థిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఎక్కువగా మోస్తుంది అనే విషయం చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: