ఏపీలో సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతీ సంక్షేమ కార్యక్రమం విషయంలో కూడా సిఎం జగన్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా సిఎం జగన్ ఎక్కువగా ఫోకస్ చేసారు. రాజకీయంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే ఇప్పుడు మాత్రం సిఎం జగన్ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు అనే చెప్పాలి. తాజాగా మరో కీలక ఆదేశాలు ఇచ్చింది ఏపీ సర్కార్. ముఖ్యంగా విద్యా వ్యవస్థ విషయంలో సిఎం జగన్ ముందు నుంచి కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

చిన్న చిన్న విద్యార్ధుల నుంచి పెద్ద వారి వరకు ఏ ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణానికి పాలనా అనుమతులు ఇచ్చింది జగన్ సర్కార్. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణం చేపడతామని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.  రాష్ట్ర వ్యాప్తంగా 28.30 లక్షల ఇళ్ల నిర్మాణానికి గృహ నిర్మాణశాఖకు అనుమతులు ఇచ్చింది. మొదటి దశలో 15.10 లక్షలు, రెండో విడతలో 13.2 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతుంది ఏపీ సర్కార్.

నిర్మాణాలకు రూ.24,776 కోట్లు ఖర్చు చేసేందుకు పాలనా అనుమతులు ఇచ్చింది. ఇళ్ల పట్టాలు, భూమి గలవారు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం చేపడుతుంది.  ఇళ్ల నిర్మాణానికి ఇంటికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితమని ప్రకటించింది ప్రభుత్వం. ఇళ్ల నిర్మాణ సంస్థను రివర్స్ టెండరింగ్ ద్వారా ఎంపిక చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇళ్ల నిర్మాణ ఏజెన్సీ ఎంపిక కోసం రాష్ట్రస్థాయి కమిటీల ఏర్పాటు చేయనుంది. వైఎస్ఆర్ కాలనీలకు నీటి సరఫరా కోసం రూ.920 కోట్లు వెచ్చించాలని నిర్ణయం తీసుకుంది. గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్ శాఖల ద్వారా నిధులు వెచ్చించాలని నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: