రోజు రోజుకు మనిషి జీవన సరళి లో ఎంతో మార్పు వస్తుంది.. అయితే ప్రస్తుతం మనిషి జీవన శైలిలో వస్తున్న మార్పులు కొంతమంది నాగరికత పెరుగుతుంది అని చెబుతుంటే మరి కొంతమంది వినాశనానికి దారి తీస్తుంది అని చెబుతూ ఉంటారు. ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో డబ్బు సంపాదించాలనే ఆశ తో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదన కోసం పరుగులు పెడుతూనే ఉన్నారు.  ఈ క్రమం లోనే ఒక సాధారణ మనిషి జీవితాన్ని గడిప లేకపోతున్నారు ఎంతో ఉంది. అంతేకాక నేటి రోజుల్లో ఒక మనిషి జీవన శైలిలో ఖర్చులు భరించడం కూడా ఎంతో భారంగా మారిపోతుంది. ప్రస్తుతం దాంపత్య జీవితంపై కూడా ఎవరూ అంతగా ఆసక్తి చూపడం లేదు.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం జననాల సంఖ్య తగ్గిపోయి మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.  తద్వారా రానున్న రోజుల్లోప్రపంచంలో అన్ని దేశాలలో కూడా మానవవనరుల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయా దేశాలు తమ తమ దేశాలలో ఇక ఏకంగా పిల్లలు కనడాన్ని ప్రోత్సహించడానికి బహుమతులు కూడా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.



ఇక రానున్న రోజుల్లో జననాల సంఖ్య కంటే  మరణాల సంఖ్య పెరిగి ఇక ప్రపంచ జనాభా తగ్గిపోతుంది అనేదానికి సజీవ మైనటువంటి సాక్ష్యం సౌత్ కొరియా. సౌత్ కొరియా లో రోజురోజుకు జననాల సంఖ్య భారీగా పడిపోవడమే  కాదు మరణాల సంఖ్య పెరిగిపోతుంది. 2 లక్షల 75 వేల 800 మంది పుడితే .. మూడు లక్షల 7764 మంది చనిపోయారు. ఇలా జననాల రేటు కంటే మరణాల రేటు భారీగా పెరుగుతుంది సౌత్ కొరియాలో . సగటున ఒక మహిళ.. 1.1 మందికి  మాత్రమే జన్మనిస్తుంది.  ఇది రానున్న రోజుల్లో ఎంతో ప్రమాదకరం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: