న్యూఢిల్లీ: దేశాన్ని వణికించిన కరోనా మహమ్మారిని ఎదుర్కొనే సమయం వచ్చేసింది. శనివారం నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. అయితే అసలు ఈ టీకా ఎవరెవరు తీసుకోవచ్చు? ఎవరు తీసుకోవద్దు? అనే విషయాలను కూడా ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ విషయంలో ఉన్న అనుమానాలను తొలగించడం కోసం కేంద్ర ఆరోగ్యశాఖ కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ.. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. తొలి దశలో ప్రభుత్వం మూడు కోట్ల మంది హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌ లైన్ వారియర్లకు టీకా అంద జేస్తుంది. ఆ తర్వాత విడతల వారీగా ప్రజలందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు చేపడుతుంది.

వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో కేంద్రం నుంచి కొన్ని మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. అవేంటంటే..

టీకా ఎవరికి ఇవ్వొచ్చు?

1. ఈ టీకా కేవలం 18 ఏళ్ల వయసు దాటిన వాళ్లకు మాత్రమే. అంతకంటే తక్కువ వయసు ఉన్న వాళ్లకు ఇవ్వకూడదు.
2. తొలి డోసు టీకా ఇచ్చిన 14 రోజుల తర్వాత రెండో డోసు కూడా ఇస్తారు.
3. తొలి డోసు ఏ వ్యాక్సిన్ తీసుకుంటే. రెండవ డోసు కూడా అదే టీకా తీసుకోవాలి.
4. వ్యాక్సిన్లను మార్చడం కుదరదు.

అలాగే టీకా ఇవ్వకూడనిది ఎవరికంటే..

1. అలర్జీ.. అన్‌ఫైలాటిక్ రియాక్షన్లు ఉన్నవారు ఈ కరోనా టీకా తీసుకోవద్దు. ఇంజక్షన్లతో అలర్జీ వచ్చేవారిని కూడా దూరం పెట్టడమే ఉత్తమం.
2. గర్భిణులు, బాలింతలు కూడా టీకా తీసుకోవద్దు. ఎందుకంటే, ఇప్పటి వరకు గర్బిణులపై టీకా ట్రయల్స్ చేపట్టలేదు. అందుకే వారికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ఛాన్సులు తీసుకోకూడదని ప్రభుత్వం భావిస్తోంది. పాలు ఇచ్చే తల్లులు కూడా టీకాకు దూరంగా ఉండడం బెటర్‌.
3. సార్స్ సీవోవీ2 ఇన్‌ఫెక్షన్ అధికంగా ఉన్నవారికి కోలుకున్న కొన్ని వారాల తర్వాతే టీకా ఇవ్వాలి.
4. ప్లాస్మా థెరపీ తీసుకున్నవారికి కూడా కొన్ని వారాల విరామం ఇచ్చిన తర్వాతే టీకా ఇవ్వడం మంచిది.
5. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా వారు కొంచెం కోలుకునే వరకూ ఆగడమే మంచింది. ఆ తర్వాతే టీకా ఇవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: