ఏపీ జె ఏ సి అమరావతి ఉద్యోగుల సంఘం ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. బొప్పారాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... పంచాయతీ ఎన్నికల నిర్వహణ కు సంబంధించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు 7పేజీల వినతి పత్రం అందించాము అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచాన్ని గడగడ లాడించిన కరోన ను ఇప్పుడు కట్టడి చేసుకుంటూ వస్తున్నాం అని ఆయన తెలిపారు. కరోన ను ఎదుర్కోవడం లో ముందు ఉన్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ ఇచ్చారు అని అన్నారు.

దీన్ని తాము గౌరవం గా భావిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయం లో ఎస్ ఈ సి పంచాయతీ ఎన్నికలు నిర్వహణ కు నోటిఫికేషన్ ఇవ్వడం ఆశ్చర్యం కలగచేసింది అని ఆయన తెలిపారు. లక్షా 40 వేల పోలింగ్ స్టేషన్స్ లక్షల బ్యాలెట్ బాక్స్ లు సరిచూసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే 30 శాతం పైబడి పోలింగ్ జరగలేదు అని  అని గుర్తు చేసారు. పంచాయతీ ఎన్నికలు వాటిని మించి జరుగుతాయి అని ఆయన వెల్లడించారు.  నూటికి నూరు శాతం పోలింగ్ కు అందరూ ప్రయత్నిస్తారు అని అన్నారు.

పి పి ఏ కిట్లు ఇవ్వమని ఎస్ ఈ సి పేర్కొంది. కరోన మహమ్మారి తీవ్రంగా ఉన్నప్పుడే అవి డాక్టర్ లకు అందలేదు అని విమర్శించారు. పి పి ఏ కిట్లు కోసం అడిగితే అప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూసామని... హైకోర్టు వద్దని చెప్తే హైకోర్టు బెంచ్ కు కేవలం పంతం కోసం ఎస్ ఈ సి వెళ్లడం దారుణం అని ఆయన ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలు రెండు డోస్ వాక్సినేషన్ పూర్తి అయ్యే వరకు వాయిదా వెయ్యాలి అని గవర్నర్ ను కోరాం అని అన్నారు. మా విజ్ఞప్తి ని గవర్నర్ సానుకూలంగా స్పందిస్తారు అని భావిస్తున్నాం అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహణ లో పార్లమెంట్, అసెంబ్లీ-పంచాయతీ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంది అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: