దేశంలో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలను కాస్త విపక్షాలు సీరియస్ గా  తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా దేశభక్తి విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చేసిన త్యాగాలను ప్రస్తావించే విషయంలో ఘోరంగా వెనక పడుతున్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా వెనకబడి ఉంది. భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎవరూ కూడా సోషల్ మీడియాలో బలపడే ప్రయత్నం చేయకపోవడం పట్ల ఇప్పుడు కార్యకర్తల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

కార్యకర్తలు ఎంత కష్టపడినా సరే నాయకులు సోషల్ మీడియాలో లేకపోతే మాత్రం పరిణామాలు కాస్త ఇబ్బంది కరంగా ఉంటాయి అనే విషయం అందరికి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్ నేతలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండటాన్ని కూడా పెద్దగా ఇష్టపడటం లేదు. దీని వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది పార్టీ. అగ్రనేతలు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా  లేకపోవడంతో కార్యకర్తలు కూడా పెద్దగా దృష్టి సారించడం లేదు. దేశభక్తి విషయంలో చేసే ప్రచారాలన్ని కూడా ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి.

 ఎలక్ట్రానిక్ మీడియాను అడ్డం పెట్టుకుని భారతీయ జనతా పార్టీ కొన్ని ప్రచారాలు చేస్తున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాస్త జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దగా దృష్టి సారించ లేకపోతున్నారు. మరి భవిష్యత్తులో అయినా సరే ఈ పరిణామాల మీద కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు దృష్టి సారిస్తారా లేదా అనేది చూడాలి. ఇదే విధానం గనుక భవిష్యతు లో కొనసాగితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: