తెలంగాణలో కరోనా కారణంగా   ఉపాధి కోల్పోయిన పేద ప్రజలు పస్తులు  ఉండకూడదు అనే ఉద్దేశంతో పేద ప్రజలందరికీ ఎంతో ప్రయోజనం చేకూరే విధంగా ఇక తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి 15 కిలోల రేషన్ బియ్యాన్ని అందించేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో అటు తెలంగాణ ప్రజానీకం మొత్తం ఎంతగానో హర్షం వ్యక్తం చేసింది. అయితే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచిత రేషన్ బియ్యం సరఫరా కావాల్సి ఉన్నప్పటికీ ఈ ప్రక్రియకు ప్రస్తుతం బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ కాస్త ఆగి పోయింది.



 అయితే ముందుగా తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు.. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఉచిత రేషన్ బియ్యం అందించేందుకు తగిన విలువలు ఉన్నప్పటికీ.. అటు బియ్యాన్ని రేషన్ షాపులకు సరఫరా చేసే వాహనాలు లేకపోవడంతో చివరికి రేషన్ షాపులు మూసి వేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఐదు రోజుల వ్యవధిలో కొంతమంది తెల్ల రేషన్ కార్డు దారులు ఇక ప్రభుత్వం అందించిన 15 కిలోల ఉచిత రేషన్ బియ్యాన్ని పొందినప్పటికీ.. ఇంకా లక్షల మంది లబ్ధిదారులు ఉచిత రేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.



 అయితే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ పంపిణీ చేసేందుకు 4.31 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం పడింది. అయితే యాసంగి లో ఎఫ్సిఐ బియ్యం నిల్వలు ఖాళీ చేయడంతో స్థానికంగానే ప్రస్తుతం బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా అయితే ఎప్పుడైనా బియ్యం నిల్వలు ఎక్కువగా లేకపోవడంతో రేషన్ నిలిపివేస్తారు. కానీ ప్రస్తుతం బియ్యం నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా ఇక వాటిని పంపిణీ చేసే వాహనాల  కొరత కారణంగా రేషన్ పంపిణీ నిలిపి వేయాల్సిన  పరిస్థితి ఏర్పడింది.  అయితే ప్రభుత్వం నుంచి బియ్యం పంపిణీ జరిగితే తాము అందరికీ సరఫరా చేస్తాము అంటూ రేషన్ డీలర్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: