అవగాహన రాహిత్యం, అనుభవ రాహిత్యం అన్నవి జగన్ ను వేధిస్తున్న సమస్యలు అన్నది తేలిపోయింది. ఇందుకు తాజాగా టీటీడీ పాలకమండలి ఏర్పాటే నిలువెత్తు నిదర్శనం.


టీటీడీ విషయమై రెండు జీఓలు ఇచ్చారు జగన్. వీటిని పరిగణించి, చదివి ఆసాంతం అర్థం చేసుకున్న కోర్టు ఆ రెంటిపై కూడా అ మలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పాలకమండలి ఏర్పాటుపై వస్తున్న విమర్శల నేపథ్యంలో బీజేపీతో సహా ఇంకొందరు కూడా తమ గొంతుకలు కలిపారు. కొందరు న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. మరి! ప్రత్యేక ఆహ్వానితుల జాబితా కు దింపు సాధ్యమేనా? కేవలం వీటిలో రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయా లేదా ఇంకేమయినా బయట శక్తులు ప్రభావితం చేస్తున్నాయా?



ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న, తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ వివాదాస్పదమే అవుతుంది. సరయిన అవగాహన లేని కారణంగానే ఇన్ని వివాదాలు ముంచుకువస్తున్నాయని ఫలితంగానే కోర్టులు కూడా మొట్టికాయలు పెడుతున్నాయని టీడీపీ విమర్శిస్తోంది. ఆరోపణలు ఎలా ఉన్నా జగన్ తో సహా ఆయనను నడిపిస్తున్న వ్యక్తుల సలహాల ప్రభావమే ప్రభుత్వంపై ఉంది అని తెలుస్తోంది. ఉండవల్లి లాంటి వైఎస్ భక్తులు కూడా ఆయన ఎవ్వరి మాట వినడూ అని అనుకోలేం కానీ ఏం చేయాలో అదే చేస్తాడు, చేస్తున్నాడు కూడా! ఇప్పుడిదే ప్రభుత్వ నిర్ణయాల అమలులో పెద్ద తలనొప్పిగా మారింది అధికార యంత్రాంగానికి. ఏం చేసినా, చేయాలన్నా కోర్టు అడ్డంకులు దాటుకుని రావాలి.



 క్లిస్టర్ క్లియర్ గా ఈ పనిచేయాలి అని చెప్పేంత సాహసం ఈ ప్రభుత్వానికి లేకపోతోంది. నిబంధనలకు లోబడి నిర్ణయాలు తీసుకోవడంలో ఉన్న విఫలత ప్రభావంగానే ఇలాంటి పరిణామాలు అన్నీ తరుచూ చోటు చేసుకుంటున్నాయి. ఇంత జరిగినా టీటీడీ విషయమై నిర్ణయాలు ఏమయ్యాయి. ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నారు నిబంధనలు అతిక్రమించి ఏ పని చేసినా అందుకు కోర్టు అడ్డంకి తప్పని సరి అని! కోర్టు అడ్డు చెప్పడం అంటే నిబంధనల్లో ఏదో ఒకటి డొల్లతనం ఉన్నదే అనుకోవాలి. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయాలు జీఓలూ కోర్టు నిలిపివేసింది. ఆహ్వానితుల సంఖ్యను అంత స్థాయిలో చూపడాన్ని కోర్టు వద్దనే చెప్పింది. అంతేకాకుండా జీఓలను సైతం నిలిపివేసి టీటీడీ విషయంలోఈఓకు నోటీసులు సైతం జారీ చేసింది కోర్టు. ఏపీ ప్రభుత్వంకు కూడా నోటీసులు అందుకుంది. ఇప్పుడేం చేస్తారు?


మరింత సమాచారం తెలుసుకోండి:

aqp