తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో ఇప్పుడు కూతురు పోరు కొనసాగుతోంది. కల్వకుంట్ల చంద్రశేఖర రావు విధివిధానాలు నచ్చక తాజాగా బహిరంగ లేఖ రాశారు కల్వకుంట్ల కవిత. అయితే ఈ లేఖ బయటపడడంతో.. అనేక రకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. కొత్త పార్టీ పెడుతుందని కొంతమంది... ఆ పార్టీలోనే ఉండి.. కెసిఆర్ ను ఇబ్బంది పడుతుందని మరికొంతమంది అంటున్నారు. మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుందని ప్రచారం చేస్తున్నారు.

 అయితే.. ఆంధ్రజ్యోతి పేపర్ మాత్రం... కల్వకుంట్ల కవితను టార్గెట్ చేసి రోజుకు కొత్త వార్త ప్రచురణ చేస్తోంది. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుందని కవితపై అనేక రకాల వార్తలు వేసింది చేసింది ఆంధ్రజ్యోతి. అయితే కాంగ్రెస్ హై కమాండ్ కవిత రాకను ఒప్పుకోవడం లేదని కూడా తెలిపింది.  అయితే ఈ వార్తలను కవిత వెంటనే ఖండించారు. దీంతో తాజాగా మరో వార్తతో ముందుకు వచ్చింది ఆంధ్రజ్యోతి. కల్వకుంట్ల కవిత... ఆరుగురు ఎమ్మెల్యేలను గులాబీ పార్టీ నుంచి తీసుకువెళ్లి కాంగ్రెస్లో చేర్చబోతున్నారని.. బాంబు పేల్చింది ఆంధ్రజ్యోతి.

 ఈ ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకువెళ్లేందుకుగాను ఆమెకు తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవి ఇస్తారని కూడా.. కాంగ్రెస్ హై కమాండ్ హామీ  ఇచ్చినట్టు జోరుగా ప్రచారం చేసింది ఆంధ్రజ్యోతి. అయితే దీన్ని రేవంత్ రెడ్డి వర్గం అడ్డుకుంటుందని కూడా స్పష్టం చేసింది. అయితే ఈ వార్తలు బయటకు రావడంతో మరోసారి కల్వకుంట్ల కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఫేక్ వార్తలు రాయకండి అని... ఏదైనా ఉంటే తనను అడిగి వేయాలని రిక్వెస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవితకు మంత్రి పదవి  రావడం అనేది హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే కాంగ్రెస్లో కల్వకుంట్ల కవితకు మంత్రి పదవి ఇస్తే... తన తండ్రి కెసిఆర్ కూడా తీర్చలేని కోరిక తీర్చినట్లు అవుతుంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: