
ప్రశాంతి రెడ్డి భర్త వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ప్రస్తుతం నెల్లూరు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. వేమిరెడ్డి కుటుంబానికి జిల్లా రాజకీయాల్లో ఘనమైన హోదా ఉంది. తొలి నుంచి మంత్రి పదవిపై ఆశ ఉండగా, ఇప్పుడు సమయానుకూల రాజకీయ సమీకరణాలు ఆమెకు అనుకూలంగా మారినట్టు తెలుస్తోంది. కోవూరు నియోజకవర్గం అంటే వైసీపీకి కంచుకోట. కానీ అక్కడే మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి vs ప్రశాంతి రెడ్డి మధ్య గట్టిగా రచ్చ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ, కూటమి పార్టీలు ప్రశాంతికి మద్దతు తెలపడంతో, ఆమెపై రాష్ట్రవ్యాప్తంగా సానుభూతి లభించింది . ఈ పరిణామాలను లెక్కలోకి తీసుకుంటే, ఆమెకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా వైసీపీ ఒక్కదెబ్బతో రెండు పిట్టలు పడేయొచ్చు:
ఇక కోవూరు నియోజకవర్గాన్ని బలపరచడం , జిల్లాలో పార్టీని రీ-ఎనర్జైజ్ చేయడం .. టీడీపీ నేతృత్వం ఇటీవల మంత్రివర్గ, ఎమ్మెల్యే పనితీరుపై అంతర్గత అధ్యయనం చేయించింది. అందులో ప్రశాంతి రెడ్డికి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిందని సమాచారం. ప్రజలతో ఫీల్డ్ కనెక్ట్, స్వతంత్ర డెవలప్‌మెంట్ పనులు, పార్టీకి వ్యతిరేకులపై బలమైన పోరాటం వంటి అంశాల్లో అతికొద్దిమంది మహిళా ఎమ్మెల్యేల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. "ప్రశాంతి రెడ్డిని మంత్రిగా చేయడం వల్ల టీడీపీకి పొలిటికల్ లాభమే ఉంటుంది. కోవూరులో పార్టీలో క్రేజ్ తగ్గకుండా ఉంచవచ్చు. మహిళా ప్రాతినిధ్యం కూడా పెరుగుతుంది. కేబినెట్ మార్పుల ప్రక్రియలో వైసీపీ విమర్శలకి సరైన సమాధానం ఇవ్వాలనుకుంటే, ఇలాంటివారిని ఎలివేట్ చేయడం తప్పనిసరి. ఇప్పుడు చూస్తుంటే ప్రశాంతి రెడ్డి పేరు, ఆమె రాజకీయ యాక్టివిటీ, ప్రజల మద్దతు ఇలా అన్ని విధాలుగా చూసి ఆమెకు మంత్రి పదవి కన్ఫామ్ అనే సంకేతాలు గట్టిగా కనిపిస్తున్నాయి.