ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ విషయంలో చాలామంది నేతలు ఉన్నారంటూ కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేయడమే కాకుండా అందుకు సంబంధించి విచారణ చేపట్టారు. ఇప్పటికే చాలామంది వైసిపి నేతలను విచారించగా తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు. ఈ కేసులో A4 గా ఉండడంతో ఆయనను సిట్ అధికారులు విచారణ చేసి మరి అరెస్టు చేశారు. విజయవాడలో సుమారుగా 7 గంటల పాటు విచారించి అనంతరం అరెస్టు చేశారు. అందుకు సంబంధించి ఆయన బంధువులకు అధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు.


లిక్కర్ పాలసీలో డొల్ల కంపెనీలకు ముడుపుల విషయం పైన ఇతరత్రా అంశాల పైన ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. ముఖ్యంగా ప్రైవేట్ సమావేశాలు ఎవరెవరితో నిర్వహించారనే విషయం పైన ఆరా తీశారట. అలాగే డొల్ల కంపెనీ నుంచి సొమ్మును లబ్ధిదారులకు చేర్చిన విధానం పైన సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో మద్యం ఆర్డర్లు సరఫరా వ్యవస్థ వంటివి ఆన్లైన్ లో ఉండగా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యానువల్ విధానంలోకి తీసుకురావడంలో మిథున్ రెడ్డి చాలా కీలకమైన పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారట.


ఇందు చేతనే విచారించినట్లు అధికారులు తెలిపారు. అందుకు సంబంధించి ఆధారాలు లభించాలని సిట్ తరఫున న్యాయవాది హైకోర్టుకు వెల్లడించారు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టు వేసింది. ఈ కేసు పైన రాజకీయ ప్రేరేపితమైన కేసు అంటూ మిథున్ రెడ్డి  అరెస్టు కాకముందు మీడియాతో  మాట్లాడారు.. ఈ అరెస్టు వల్ల వారు కొద్ది రోజులు ఆనందపడవచ్చు ఏమో కానీ చట్టం ముందు నిలబడే కేసు కాదు అంటూ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయంగా దురుద్దేశంతోనే తన పైన మద్యం కేసు లో నిందితుడిగా చేర్చారని తెలియజేశారు. నిన్నటి రోజున శనివారం ఈరోజు ఆదివారం కావడం చేత బెయిల్ రాదనే విషయం మరి అరెస్టు చేసినట్లుగా కొంతమంది నేతలు వెల్లడిస్తున్నారు. మరి మిథున్ రెడ్డి కి  బెయిల్ వస్తుందా రాదా అనే విషయంపై కూడా నేతలు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: