
సీఎంగా చంద్రబాబు నాల్గవసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సుమారుగా 14 మాసాలలోనే పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు ఏపీలో పెట్టడానికి చాలా కంపెనీలు వస్తున్నాయి. సుమారుగా 9 లక్షల కోట్ల మెర ఒప్పందాలతో పాటుగా కొత్తగా 8లక్షల మందికి ఉద్యోగాలను సృష్టించే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకు సంబంధించి కొన్ని సంస్థలతో కూడా ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకొని కొన్నిచోట్ల నిర్మాణాలను ప్రారంభించారు.
ఇప్పటివరకు సీఎం చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం పరిసర ప్రాంతాలలో కూడా ఎలాంటి పెద్ద పరిశ్రమలు లేవు.. కేవలం వ్యవసాయం మీద ఆధారంగానే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. అంతేకాకుండా విద్య, వైద్య రంగాలలో కూడా అక్కడివారు అభివృద్ధి చెందాలని భావిస్తున్నారట చంద్రబాబు. అందుకే ఈసారి కుప్పంలో అల్యూమినియం ఎక్స్ ట్రూజన్ ప్లాంటును ఏర్పాటు చేసే సంస్థలతో ఒప్పందం కుదురుచ్చారట. ముఖ్యంగా బెంగళూరుకు ఇటు చెన్నై కి కూడా రవాణా సౌకర్యాలు సౌకర్యంగా ఉంటాయని కుప్పంలో పరిశ్రమ ఏర్పాటు అయితేనే అన్ని విధాలుగా మంచిదని భావిస్తున్నారు.
యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల బాడీలను ప్రత్యేకించి తయారు చేసేటువంటి సంస్థని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. కుప్పంలో ఈ ప్రాజెక్టు కేవలం ఉద్యోగాల కల్పనకే కాదని "మేక్ ఇన్ ఇండియా" నినాదంతో రాష్ట్రంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా అల్యూమినియం పరిశ్రమలకు ముడిసరకు సైతం అందించేలా ప్లాన్ చేస్తున్నారట. గతంలో విదేశాల నుంచి ఐఫోన్ విడిభాగాలను దిగుమతి చేసుకునే వారు ఇప్పుడు మనదేశంలోనే మన రాష్ట్రంలోనే తయారు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. 2027 నాటికి మార్కెట్లోకి వీటిని అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.