
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కూతురు కవిత తన కుటుంబంపై తిరుగుబాటు చేసింది. మొన్నటి వరకు కేటీఆర్ ఇతర నాయకులు కలిసి కేసీఆర్ ను ముంచుతున్నారని ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని విమర్శించారు. ఇది మరువకముందే మరో మారు ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు, సంతోష్ రావు చాలా డేంజర్ అని, వీళ్లు అనేక స్కాములు చేసి కేసీఆర్ ను అందులో ఇరికించాలని చూస్తున్నారని ఆమె అన్నారు. మరక లేనటువంటి కేసీఆర్ కు మరక పూయాలని వీళ్లే చూస్తున్నారని ఆరోపణలు చేశారు. అయితే దీనిపై స్పందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాదు ఆమె చేసిన మాటలకు కనీసం ఆ పార్టీలోని ఏ నాయకుడు కూడా స్పందించలేదు. అలాగే ఇతర పార్టీల నాయకులు కూడా ఆమెకు మద్దతుగా నిలవలేదు.