తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా డిఫరెంట్ గా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి పనులపై బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉంది. బీఆర్ఎస్ ఓడిపోయి ఇన్ని నెలలు గడిచినా కానీ కాంగ్రెస్ ఇంకా కాళేశ్వరం కేసీఆర్ పై ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ముందుకు వెళుతున్న సమయంలో  కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆ కేసు సిబిఐ కి అప్పగించారు కాంగ్రెస్ ప్రభుత్వం.ఇదే సందర్భంలో కవిత బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి పార్టీ నుంచి సస్పెండ్ అయింది. తెలంగాణలో రాజకీయాలు అతలాకుతలంగా నడుస్తున్న సమయంలోనే తాజాగా ప్రెస్ మీట్ పెట్టినటువంటి కేటీఆర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ..టబీఆర్ఎస్ పార్టీ టికెట్ నుంచి గెలిచినటువంటి నాయకులు  కాంగ్రెస్ లో చేరారని, కానీ వారు బయటకు మాత్రం మేము కాంగ్రెస్ లో చేరలేదని బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ టీపీసీసీ ప్రెసిడెంట్ ఏమో వీరంతా కాంగ్రెస్ లో చేరారని చెప్పుకొస్తున్నారు. అంటే ఇక్కడ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి నేను ఇంకా కాంగ్రెస్ లో చేరలేదని చెబుతూనే  ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఒకవేళ ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే మా పార్టీ ఆఫీస్  కి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అలాగే కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ నాయకులు తిడుతుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ఇలా రెండు పడవలపై కాలు వేసి ఎందుకు నడుస్తున్నారని అన్నారు.

సాధారణంగా లింగాలలో ఒకటి స్త్రీ లింగం ఒకటి పులింగం మాత్రమే ఉంటాయని, ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ లింగం వారే తెలుసుకోవాలని  విమర్శించారు. మీరంతా జీవితకాలం ఎన్నో రాజకీయాలు చేసి మంత్రులుగా పనిచేసిన కానీ కనీసం కాంగ్రెస్ లో ఉన్నామా బీఆర్ఎస్ లో ఉన్నామా అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని, ఇలాంటివారిని మేము ఏమనాలో తేల్చుకోవాలని అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ లో చేరాలని కడియం శ్రీహరి చెప్పుకున్నారని ఆయన పై చర్యలు తీసుకోవాలని కోరారు అయితే కేటీఆర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలను పరోక్షంగా గే అంటూ మాట్లాడారని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: