
అసెంబ్లీ సమావేశాలలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలియజేశారు మంత్రి నారాయణ. రాష్ట్రంలో 2,61,640 టీడ్కో ఇళ్ల నిర్మాణాన్ని 2026 జూన్ నెలకి పూర్తి చేస్తామని ఆ దిశగానే ప్రభుత్వం ముందుకు సాగుతున్నదంటూ మంత్రి నారాయణ తెలిపారు. అలా ఏ ప్రాంతంలోనైనా సరే టిడ్కో ఇల్లులు పూర్తి అయితే మాత్రం ప్రతి శనివారం వాటిని లబ్ధిదారులకు అందించే విధంగా ఆదేశాలను జారీ చేశామంటూ మంత్రి నారాయణ తెలియజేశారు. వీటికి తోడు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిల కోసం, టిడ్కో ఇల్లులకు సంబంధించి మౌలిక సదుపాయాల కోసం రూ. 7280 కోట్ల రూపాయలు అవసరమవుతాయి అంటూ తెలిపారు.
ఇందుకోసం బ్యాంకుల నుంచి రుణాలు కూడా సమీకరిస్తున్నామంటూ మంత్రి నారాయణ అసెంబ్లీ వేదికగా తెలియజేశారు. గత వైసిపి హయాంలో కేంద్రం కేటాయించిన ఇళ్లను కట్టలేదని వెల్లడించారు. 2014-2019 మధ్యలో ఏపీకి కేంద్రం 7 లక్షలకు పైగా టిడ్కో ఇళ్లను కేటాయిస్తే ఇందులో 5 లక్షల నిర్మాణాలను మాత్రమే అనుమతులు వచ్చాయని ఆపై ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచి ఇవ్వగా గత వైసిపి ప్రభుత్వం మాత్రం 2,61,640 తగ్గించిందని.. ఆ ఇళ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేయలేదంటూ తెలిపారు మంత్రి నారాయణ. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం టిడ్కో ఇళ్ల పై ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి మరి పూర్తి చేస్తున్నామంటు తెలిపారు.