
మారిన వాతావరణం హైదరాబాద్ ను వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. పలు ప్రాంతాలలో భారీ వర్షపాతం కారణంగా తీవ్ర వరదలు సంభవిస్తున్నాయి బంజారా హిల్స్, సనత్ నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ ,హైటెక్ సిటీ,ఇలా ఎన్నో ప్రాంతాలలో కూడా రోడ్లు జలమయమయ్యాయి. ముఖ్యంగా ప్రధాన రహదారులపై పెద్ద ఎత్తున నీరు రావడంతో వాహనాలు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఈ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడి అక్కడ ప్రజలను, ఉద్యోగస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీనివల్ల చాలామంది వ్యాపారవేత్తలు కూడా నష్టాలను చవిచూస్తున్నారు.
తక్కువ సమయంలోనే ఎక్కువ మోతాదులలో వర్షాలు రావడంతో ఏకంగా ఇళ్లల్లోకి నీళ్లు వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో నిరంతరం అక్కడి ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారు. కొత్తగా కంపెనీలు పెట్టడానికి చాలామంది భయపడుతున్నారు. అందుకే ఇతర రాష్ట్రాలలోని ప్రాంతాలను వెతుక్కోవడానికి సన్నహాలు చేసుకుంటున్నట్లు వినిపిస్తున్నాయి. ఇక ఆంధ్రాలో విషయానికి వస్తే విశాఖపట్నం సేఫస్ట్ ప్లేస్ గా మారుతోంది. ఎందుకంటే మొదట ఇక్కడి నుంచి తుఫాన్ తీరం ప్రారంభమైనప్పటికీ కానీ ఆ తీరం దాటేటప్పటికి వేరే చోటికి వచ్చేస్తోంది. ఒకప్పటి హైదరాబాద్ పరిస్థితి ఇప్పుడు విశాఖపట్నం కలదు. కాబట్టి ఈ విషయం ఏపీ ప్రభుత్వం కూడా సద్వినియోగం చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ ఐటీ కంపెనీలు, సాఫ్ట్వేర్ ,ఇండస్ట్రియల్ తో మరింత ముందుకు వెళుతుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.