బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి కత్రినా కైఫ్ రీసెంట్ గా ప్రెగ్నెన్సీ విషయాన్ని బయట పెట్టింది. చాలా రోజుల నుండి గుట్టుగా ఉంచిన ఈ హీరోయిన్ ఫైనల్ గా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని రివీల్ చేసింది. దీంతో కత్రినా కైఫ్ అభిమానులు అందరూ ఆనందోత్సాహంలో మునిగిపోయారు. అయితే గత కొద్ది సంవత్సరాల నుండి కత్రినా ప్రెగ్నెన్సీ వార్తలు వినిపిస్తున్నప్పటికీ అవన్నీ రూమర్లు గానే మిగిలాయి. తన అభిమాని అయినటువంటి నటుడు విక్కీ కౌశల్ ని ప్రేమించి 2021 లో పెళ్లి చేసుకున్న కత్రినా కైఫ్ ఎట్టకేలకు తల్లి కాబోతున్నట్టు శుభవార్తను అభిమానులతో పంచుకుంది. అయితే సినీ నటీమణుల ప్రెగ్నెన్సీ విషయంలో అప్పుడప్పుడు కొన్ని విషయాలు బయటపడుతుంటాయి.ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ ప్రెగ్నెన్సీ ని రివీల్ చేయడంతోనే కొంతమంది జ్యోతిష్యులు తగుదనమ్మా అంటూ వచ్చి జ్యోతిష్యాలు మొదలు పెడుతూ ఉంటారు. అలా రీసెంట్ గా తల్లైనా దీపిక పదుకొనే ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఆమె ప్రెగ్నెన్సీ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు.

 ఇక తాజాగా కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ పై కూడా ఓ ప్రముఖ జ్యోతిష్యుడు చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి.మరి ఇంతకీ ఆ జ్యోతిష్యుడు ఎవరు? కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ పై ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ పై తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు అనిరుధ్ కుమార్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ.. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ లకు పుట్టబోయేది ఆడబిడ్డ నే.. వాళ్ళు మొదట ఆడ పిల్లను ఆహ్వానిస్తారు.అలా వీరికి మొదటి జననం ఆడపిల్లనే అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది జ్యోతిష్యుడి మాటలపై ట్రోల్ చేస్తున్నారు. మీరు చెప్పేవన్నీ అబద్ధాలే అవుతున్నాయి. కేవలం 50% నిజం అవుతున్నాయి అందులో కూడా కొన్ని కొన్ని అబద్ధాలే ఉన్నాయి. మీరు చెప్పింది ఇప్పుడు మేం నమ్మాలా.. అంటూ కామెంట్స్ పెడితే..మరి కొంతమందేమో ఇప్పుడు కూతుళ్ల సీజన్ నడుస్తోంది..

 అందుకే అందరికీ కూతుళ్లే పుడుతున్నారు అంటూ కామెంట్ పెట్టాడు. ఇక మరో నెటిజన్ అయితే దీపికా పదుకొనే ప్రెగ్నెన్సీ విషయంలో కూడా ఇలాగే ఓ జ్యోతిష్యుడు జాతకం చెప్పి అడ్డంగా బుక్ అయ్యాడు. దీపికకు పుట్టబోయేది మగ బిడ్డ అన్నాడు. కానీ తీరా దీపికకు ఆడబిడ్డ పుట్టింది.ఆ సమయంలో ఆ జ్యోతిష్యుడు తల ఎక్కడ పెట్టుకున్నాడో కనీసం సోషల్ మీడియాలో ఎక్కడ కూడా కనిపించలేదు అంటూ రకరకాల కామెంట్స్ పెడుతూ ఆ జ్యోతిష్యున్ని ట్రోల్ చేస్తున్నారు. మరి కత్రినా కైఫ్ కి పుట్టబోయే బిడ్డ ఎవరో తెలియాలంటే కచ్చితంగా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీకి ముందు చివరిసారిగా మేరి క్రిస్మస్ అనే మూవీలో విజయ్ సేతుపతితో కలిసి నటించింది. ఇక ఇక విక్కీ కౌశల్ విషయానికొస్తే.. ఈయన ఈ మధ్యనే ఛావా అనే బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: