డాక్టర్ కోడెల శివప్రసాద్ అంటే తెలియని వారు ఉండరు..ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పేరు ఇటీలవ కాలంలో సోషల్ మీడియాలో మారుమోగుతుంది. 1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కోడెల 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచాడు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలైనా, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందాడు.

శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశాడు.. కోడెల శివప్రసాదరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మరియు ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఎన్నుకోబడిన తొలి శాసనసభాపతిగా పనిచేశారు.  కొంతకాలంగా వరుస కేసులతో సతమతమవుతున్న కోడెల శివప్రసాదరావు.... సోమవారం మధ్యాహ్నం కోడెల తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.  తీవ్ర మనస్థాపం కారణంగానే ఆత్మహత్యా యత్నం  చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కోడెల... మళ్లీ ఈ రకంగా ఆస్పత్రిలో చేరడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. కోడెలతో పాటు ఆయన కుమారుడు, కూతురుపై అనేక కేసులు నమోదు కావడం... ఆయన కుమారుడు కేసుల కారణంగా అజ్ఞాతంలోకి వెళ్లడం గమనార్హం. ఆత్మహత్యాయత్నం చేసిన వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.  ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు

. కాగా.. గత కొన్ని రోజులుగా ఈయన్ను కేసులు చుట్టుముట్టడంతో.. రాజకీయ వేధింపులు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ చనిపోయారని వార్తలు వస్తున్నాయి.  ఇదిలా ఉంటే.. కోడెలను గుంటూరులో ఆయన అభిమానులు, అనుచరులు ‘పల్నాటి పులి’గా పిలుచుకుంటూ ఉంటారు. కోడెల ఇకలేరన్న విషయం తెలుసుకున్న వీరాభిమానులు, టీడీపీ కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: