ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో  అందరి చూపు హుజూర్నగర్ ఉప ఎన్నిక వైపే. అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గంలో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత పార్లమెంటు ఎలక్షన్లలో కూడా పోటీ చేసి గెలుపొందారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. అయితే పార్లమెంట్ ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా  రాజీనామా అనంతరం ఇంకొన్ని రోజుల్లో అక్కడ ఉపఎన్నిక జరగబోతుంది. అక్కడ గెలవడానికి అన్ని పార్టీలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. మరోసారి ఈ నియోజకవర్గంలో గెలుపు పొందాలని కాంగ్రెస్... ఈసారి ఎలాగైనా హుజూర్నగర్ సీటు దక్కించుకోవాలని టిఆర్ఎస్... ఊహించని విధంగా విజయం  సొంతం చేసుకుని మరోసారి అందరికీ షాక్ ఇవ్వాలని  అనుకుంటుంది బిజెపి.

 

 

అయితే హుజూర్ నగర్లో ఉప  ఎన్నిక కోసం ఎవరిని అభ్యర్థిగా ఎన్నికోవాలనే దానిపై ఇప్పటికే అన్ని పార్టీల్లో చర్చలు మొదలయ్యాయి. కాగా హుజూర్నగర్ ఎన్నికపై మంత్రి జగదీశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తమ పార్టీ అభ్యర్థి స్వల్ప తేడాతో ఓడిపోవడానికి ... ప్రత్యర్థికి ఒకరికి ట్రక్కు గుర్తు ఉండడమే కారణమని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ ట్రక్కు గుర్తు వల్లే చాలామంది కారుకు వేయాల్సిన ఓటు ట్రక్కు  గుర్తుకు వేశారని జగదీష్ రెడ్డి తెలిపారు. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని... హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచే అభ్యర్థిని నిర్ణయించేది కెసిఆర్ మాత్రమేనని వెల్లడించారు. కాగా గత ఎన్నికల్లో తాము దాడులకు పాల్పడ్డామనేది  ముమ్మాటికి నిజం కాదని.... కావాలని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: