ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మన్ గా పేరు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ ఒకసారి మైదానంలోకి దిగాడు భారీ స్కోర్లు చేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో బ్యాటింగ్ లో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఇప్పటికే విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులను తిరగరాశాడు అన్న విషయం తెలిసిందే. అందుకే విరాట్ కోహ్లీ నీ రికార్డుల రారాజు అని కూడా పిలుస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే కేవలం భారీ పరుగులు చేయడమే కాదు ఎంతో స్టైలిష్ క్రికెటర్గా కూడా విరాట్ కోహ్లీ మంచి పేరు ఉంది.



 ఎంతో టెక్నిక్తో క్లాసికల్ షాట్లు ఆడుతూ అందరిని అబ్బుర పరుస్తూనే ఉంటాడు విరాట్ కోహ్లీ. ఇటీవలే ఒక అదిరిపోయే షాట్ ఆడి  బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని సైతం ఫిదా చేశాడు విరాట్ కోహ్లీ. ఐపీఎల్ 2022 లో భాగంగా ఇటీవలే లక్నో, బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భాగంగా టాస్ ఓడిపోయినా బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఇక బెంగళూరుకు మొదట్లోనే బిగ్ షాక్ తగిలింది అని చెప్పాలి. బెంగళూరు జట్టు కెప్టెన్ డుప్లెసిస్ ఆవేష్ ఖాన్  బౌలింగ్లో గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు.


 ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాజస్థాన్ కోహ్లీతో కలిసి మంచి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేయగా.. ఇక ఈ లిస్ట్ లో రెండో ఓవర్లో తొలి బంతికే విరాట్ కోహ్లీ కొట్టిన స్టైలిష్ బౌండరీతో మ్యాచ్ వీక్షిస్తున్న బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫిదా అయిపోయాడు. కోల్కతా వేదికగా జరుగుతున్న మ్యాచ్ కి అటు సౌరవ్ గంగూలీ, జైషాతో కలిసి గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ ను ఎంతగానో ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే చామీరా బౌలింగ్లో మిడ్ వికెట్ దిశగా కళ్లుచెదిరే బౌండరీ కొట్టాడు విరాట్ కోహ్లీ. దీంతో ఇక గ్యాలరీ లో ఉన్న సౌరవ్ గంగూలీ వారెవ్వా క్యా షాట్ హై అన్నట్లుగా ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. దీనిని అక్కడ ఉన్న కెమెరామెన్ ని క్లిక్ మనిపించాడు. దీంతో ఈ ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఇక తర్వాత 25 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఆవేశ్ ఖాన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత రజత్  ఒంటరి పోరాటం చేశాడు. ఏకంగా 54 బంతుల్లో 112 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నాడు. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు ఈ టార్గెట్ ఛేధించలేక పోయింది. దీంతో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు జట్టు విజయం సాధించి ముందుకు వెళితే  లక్నో జట్టు ఓటమి తో ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది..

మరింత సమాచారం తెలుసుకోండి: