సాధారణంగా ఆసియా కప్ ని అన్ని జట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటాయ్. ఆసియా కప్  గెలవడం కోసం ఎంతో తీవ్రంగా శ్రమిస్తా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో ఆసియా కప్ కొట్టు తీరుతుందని భారీ అంచనాల మధ్య భారత హాకీ జట్టు రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్లో విజయం సాధించడంతో అభిమానులందరికీ కూడా భారత హాకీ జట్టు ప్రదర్శనపై మరింత అంచనాలు పెరిగిపోయాయి అని చెప్పాలి.  ఇలాంటి సమయంలోనే తర్వాత మ్యాచ్లో ఓటమి చవిచూసింది. ఇలా పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగించింది భారత హాకీ జట్టు.


 ఇక ఇటీవలే ఆసియా కప్ లో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కూడా మంచి ప్రదర్శన తో ఆకట్టుకో లేకపోయింది. ప్రత్యర్థి జట్టుకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ అటు పై చేయి మాత్రం సాధించలేకపోయింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగియడం తో ఇక ఆసియా కప్ నుంచి భారత హాకీ జట్టు నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఫైనల్ చేరాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత హాకీ జట్టుకు నిరాశ తప్పలేదు అన్నది తెలుస్తుంది. ఇటీవలే దక్షిణ కొరియాతో మ్యాచ్ ఆడింది భారత జట్టు. ఈ క్రమంలోనే ఇరు జట్లు కూడా చెరో నాలుగు గోల్స్ తో సమానంగా కొనసాగాయి. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.


 ఈ క్రమంలోనే భారత్ ఆసియా కప్ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన దక్షిణ కొరియా మలేషియా జట్లు నిలిచాయి. ఇక బుధవారం ఫైనల్ లో పోటీ పడబోతున్నాయ్ అని అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే  ఆసియా కప్ విజేతగా ఎవరు నిలవ బోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక అంతకు ముందు మలేషియా 5- 0 తేడాతో జపాన్ హాకీ జట్టును చిత్తు చేసి ఇక ఫైనల్లో అడుగుపెట్టింది అన్న విషయం తెలిసిందే. ఏదేమైనా భారత హాకీ జట్టు ఫైనల్ చేరకుండానే నిష్క్రమించడంతో అభిమానులు నిరాశ లో మునిగిపోయారు..

మరింత సమాచారం తెలుసుకోండి: