పాకిస్థాన్ క్రికెటర్లకు గొప్పలు చెప్పుకోవడం వెన్నతో పెట్టిన విద్య అన్న విషయం తెలిసిందే. తమ దేశ క్రికెట్ గురించి ఎప్పుడు ఎన్నో గొప్పలకు పోతూ ఉంటారు. ప్రపంచంలోనే మేమే ది బెస్ట్ అని చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ కప్ లో మొదటి సారి భారత్ పై పాకిస్థాన్ విజయం సాధించింది. అది కూడా పది వికెట్ల తేడాతో. దీంతో ఇక పాకిస్తాన్ క్రికెటర్లలో గర్వం కాస్త పెరిగి పోయింది అని చెప్పాలి. తమ జట్టు పటిష్టంగా ఉందని భారత జట్టు తమ ముందు నిలవలేదు అంటూ ఎన్నో వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో పాకిస్థాన్ క్రికెటర్లు మాజీ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారిపోయాయ్ అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ సైతం ఇదే చెబుతున్నాడు. సాధారణంగా పాకిస్తాన్ క్రికెట్ లో అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కూడా ఫాస్ట్ బౌలింగ్ విభాగమే జట్టు ప్రధాన బలం అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, హరీష్ రౌఫ్ లతో పాకిస్థాన్ జట్టు పటిష్టంగానే కనిపిస్తుంది.. అలా అని ప్రపంచ క్రికెట్లో అటు పాకిస్థాన్ బౌలింగ్ విభాగమే గొప్ప అంటే మాత్రం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అస్సలు అంగీకరించరు అని చెప్పాలి. అయితే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన పాకిస్థాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 వరల్డ్ లోనే మా బౌలింగ్ విభాగం ది బెస్ట్ అంటూ గొప్పలకు పోయాడు. ఈ విషయం మేమే కాదు చాలా మంది విదేశీ క్రికెటర్లు కూడా ఒప్పుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.  ఇక కొంతమంది ఇంగ్లాండ్ క్రికెటర్లు మా బౌలర్లను పొగడడం విన్న తర్వాత ఎంతో గర్వంగా అనిపించింది అంటూ తెలిపాడు. దీనిపై స్పందిస్తున్న ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు మా బౌలర్లు బెస్ట్ అనుకోవడం మంచిదే.. కానీ ప్రపంచంలోనే మా బౌలర్లు మాత్రమే బెస్ట్ అనుకోవడం మాత్రం కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ లా కనిపిస్తుంది అంటూ చురకలు అంటిస్తూ ఉండడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: