గత ఏడాది కరోనా వైరస్ కారణంగా వాయిదా పడి  ఇక ఇప్పుడు రీషెడ్యూల్ చేయబడిన టెస్ట్ మ్యాచ్ ను టీమ్ ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఆడుతోంది. ఇక జస్ప్రిత్ బూమ్రా కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగింది. ఐదు టెస్టుల మ్యాచ్లో భాగంగా ఇప్పటికే 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది టీమిండియా. ఇక సిరీస్ విజయం సాధించి చరిత్ర సృష్టించాలంటే టెస్టు మ్యాచ్లో తప్పక గెలవాలి లేదంటే డ్రాగా ముగించాలి. ఈ క్రమంలోనే టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది అన్న దాని పైనే అందరి దృష్టి ఉంది అని చెప్పాలి. ఇక ఇటీవల టెస్టు మ్యాచ్ ప్రారంభం కాగా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్మెన్స్ తక్కువ పరుగులకే వికెట్ చేజార్చుకుని నిరాశపరిచారు.



 దీంతో టీమిండియా బ్యాటింగ్ విభాగం మొత్తం కుప్పకూలి పోవడం తో ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ రవీంద్ర జడేజా జట్టును ఆదుకుని ఒక మంచి స్కోరు అందించగలిగారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టెస్ట్ మ్యాచ్లో భాగంగా శ్రేయస్ అయ్యర్ కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. 11 బంతుల్లో మూడు ఫోర్లు సహాయంతో 15 పరుగులు చేసి కాస్త ఫామ్ లోనే ఉన్నట్టు కనిపించాడు శ్రేయస్ అయ్యర్. కానీ ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ వేసిన షార్ట్ పిచ్ బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. దీంతో వికెట్ కీపర్ సామ్ బిల్డింగ్స్ కి క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు.


 శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్ ను కళ్లుచెదిరే రీతిలో ఒంటిచేత్తో పట్టేసుకున్నాడు వికెట్ కీపర్ సామ్ బిల్డింగ్స్. దీంతో శ్రేయస్ అయ్యర్ చేసేదేమీలేక నిరాశగా పెవిలియన్ చేరాడు అని చెప్పాలి. అయితే తక్కువ పరుగులకే శ్రేయస్ అయ్యర్ వికెట్ కోల్పోవడంతో అతనిపై ట్రోల్స్ రావడం మొదలయ్యాయి. శ్రేయస్ అయ్యర్ కి బౌలింగ్ చేసిన జేమ్స్ అండర్సన్ కి ప్రస్తుతం 40 ఏళ్లు అన్న విషయం తెలిసిందే. దీంతో 40 ఏళ్ల అంకుల్ చేతిలో వికెట్ కోల్పోయావు అంటూ కొంత మంది నెటిజన్లు రోల్స్ చేస్తున్నారు. షార్ట్ పిచ్ బంతి నీ బలహీనత అని ప్రతి మ్యాచ్లో నిరూపించుకుంటున్నావ్ అంటూ మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: