ఇండియన్ క్రికెట్ లో ఎందరో ఆటగాళ్లు తమ ఆటతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. అటువంటి ఆటగాళ్లలో ఒకరే టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. అయితే గత మూడు సంవత్సరాలుగా విరాట్ తన టోటల్ కెరీర్ లో అత్యంత బ్యాడ్ టైం ను ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి. అంతెందుకు ఈ మూడేళ్ళుగా విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ లలో కలిపి ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం చాలా బాధను మిగిల్చే విషయం. ఒకప్పుడు విరాట్ కోహ్లీ క్రీజులోకి అడుగు పెడితే చాలు అర్ద సెంచరీ లేదా సెంచరీ పక్క అనుకునే వారు ఫ్యాన్స్. అంతలా తన బ్యాటింగ్ తీరుతో బౌలర్లను చీల్చి చెండాడే వాడు.

కానీ ఈ మూడేళ్ళుగా చూసుకుంటే కోహ్లీ బ్యాట్ కూడా సరిగా అరగలేదు. ఎందుకంటే అసలు బంతిని బాదితేనే కదా అరుగుతుంది ? విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఫ్యామిలీ, అభిమానులు, స్నేహితులు, టీం సభ్యులు మరియు ఇండియా యాజమాన్యం అంతా కూడా చాలా విచారంలో ఉన్నారు. అయితే దీనిపై చాలా కాలం నుండి ట్రోల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. కానీ కోహ్లీ మాత్రం అన్నిటినీ దిగమింగుకుని ఒక్క ఇన్నింగ్స్ తో అందరికీ సరైన సమాధానం ఇవ్వాలని ఎదురుచూస్తున్నాడు. కానీ తాను మాత్రం ఒకటి అనుకుంటే కాలం మరొకటి తలుస్తోంది. ఇక నిన్ననే ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలోనూ సెంచరీ బాకీ ఉండిపోయింది.

అయితే క్రికెట్ లో ఏ క్రికెటర్ కి అయినా కాలం ఒకేలా ఉండదు. ఫామ్ కోల్పోవడం, మళ్ళీ అందుకోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. అయితే కోహ్లీ లాంటి ప్రపంచ శ్రేణి ఆటగాడికి ఇలా జరుగుతూ ఉండడం మింగుడు పాడనీ విషయం అని చెప్పాలి. తన ఫామ్ కారణం గా వెస్ట్ ఇండీస్ తో జరగబోయే సిరీస్ కు కూడా విశ్రాంతి పేరుతో వేటు వేసింది సెలక్షన్ కమిటీ. అయితే ఇంకెప్పుడు కోహ్లీ కోలుకుంటాడు ? అసలు కోహ్లీకే ఎందుకు ఇలా జరుగుతోంది అన్నది తమ ఫ్యాన్స్ ఆవేదన.


మరింత సమాచారం తెలుసుకోండి: