ఐపీఎల్లో పటిష్టమైన జట్టుగా ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న టీమ్స్ లిస్ట్ చూసుకుంటే కోల్కతా నైట్రైడర్స్ జట్టు పేరు కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి కూడా పటిష్ఠమైన జట్టుగా గుర్తింపు సంపాదించుకున్న కోల్కత నైట్ రైడర్స్ ఇప్పటివరకు రెండు సార్లు టైటిల్ విజేత గా కూడా నిలిచింది అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలం నుంచి మాత్రం కోల్కతా జట్టు లో ఎన్నో అనూహ్యమైన మార్పులు జరుగుతున్న నేపథ్యంలో ఊహించని రీతిలో పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తుంది.  సమష్టిగా రాణించడంతో విఫలమవుతున్న కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఐపీఎల్ లో లీగ్ మ్యాచ్ ల తోనే సరిపెట్టుకుంటూ ఉంది అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో ఎట్టిపరిస్థితుల్లో కప్పు కొట్టాలనే లక్ష్యంతో జట్టు యాజమాన్యం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తమ జట్టు హెడ్ కోచ్ ని మార్చింది. రంజి దిగ్గజం చంద్రకాంత్ పండిట్ ను ఇటీవలే కోల్కత జట్టు కోచ్ గా నియమించింది  యాజమాన్యం. ఆరుసార్లు రంజీ ట్రోఫీ గెలిపించిన కోచ్గా చంద్రకాంత్ పండిట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇక కోచ్గా సరైన వ్యక్తిని ఎంపిక  చేసిన కోల్కతా జట్టు సగం సక్సెస్ అయినట్లే అని అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు.  ఇక చంద్రకాంత్ పంది సెలెక్షన్ పై గత కొంత కాలం నుంచి స్పందిస్తున్న మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి.


 ఇలాంటి సమయంలోనే టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ కోల్కతా జట్టు సీఈవో వెంకీ మైసూర్ మధ్య ఆసక్తికర సంభాషణ సోషల్ మీడియా వేదికగా జరిగింది. ఇటీవలే మధ్యప్రదేశ్ జట్టు రంజీ టైటిల్ గెలిచిన నేపథ్యంలో.. ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. కంగ్రాట్స్ మధ్యప్రదేశ్.. రంజీ ట్రోఫీ గెలిచినందుకు.. చంద్రకాంత్ పండిట్ మరోసారి మ్యాజిక్ చేసారు. అతనికి ఐపీఎల్ కోచ్ కాంటాక్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటూ ఒక పోస్టు పెట్టాడు. ఇప్పుడు చంద్రకాంత్ పండిట్ కేకెఆర్ కోచ్ గా ఎంపికైన నేపథ్యంలో జట్టు సీఈవో వెంకీ మైసూర్ స్పందిస్తు.. ఇర్ఫాన్ పఠాన్ పాత పోస్టు ట్యాగ్ చేస్తూ.. ఇర్ఫాన్ భయ్యా మీ మాటలను విన్న.. అందుకే.. అంటూ ఒక లాఫింగ్ ఎమోజి పోస్ట్ చేశాడు.  అయితే చంద్రకాంత్ పండిట్   తీసుకోవాలనీ ఐడియా ఇచ్చా.. అందుకే నా బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపుతున్నా అని ఫన్నీ పోస్టు పెట్టాడు ఇర్ఫాన్ పఠాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: