ఇటీవలే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా జరగగా... ఈ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక జట్టు విజయం సాధించి సత్తా చాటింది అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆసియా కప్ను ఓటమితో ప్రారంభించిన శ్రీలంక జట్టు బంగ్లాదేశ్ పై విజయంతో మళ్లీ విజయ పరంపర కొనసాగింది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మొదటి మ్యాచ్లో ఓడిపోయి ఆ తర్వాత బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకో లేకపోయింది అని చెప్పాలి.


 దుబాయ్ స్టేడియం లో కేవలం టాస్ గెలిచిన జట్టుదే విజయం అంటూ  ఒక అభిప్రాయం ఉంది.  కానీ ఈ అభిప్రాయాన్ని తలకిందులు చేస్తూ ఓడిపోయినప్పటికీ మొదట బ్యాటింగ్ చేసినప్పటికి కూడా ప్రత్యర్థిని ఢీకొట్టి విజయకేతనం ఎగురవేసింది భారత జట్టు.  ఈ క్రమంలోనే గెలుపు లోని అసలు సిసలైన మజాను రుచిచూసింది అని చెప్పాలి.  అయితే సొంత గడ్డపై అందుకోవాల్సిన ఆసియా కప్ ట్రోఫీని ఇక యూఏఈ వేదికగా అందుకుంది శ్రీలంక జట్టు.  ఇక ఫైనల్లో విజయం అనంతరం మాట్లాడిన శ్రీలంక కెప్టెన్ దాసూన్ షనక  తన ఆనందాన్ని పంచుకున్నాడు.


 ఇటీవలే ఫైనల్ మ్యాచ్ లో తమకు ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్ఫూర్తిగా నిలిచింది అని చెప్పుకొచ్చాడు.  ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ లో తొలుత టాస్ ఓడి పోయి బ్యాటింగ్ చేసింది. ఉత్కంఠభరితంగా   జరిగిన పోరులో చెన్నై జట్టు విజయం సాధించింది. మేము ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కూడా నా మదిలో ఇదే విషయం  మెదిలింది. మా జట్టు లోని యువ ఆటగాళ్లు అందరు కూడా అద్భుతంగా రాణించారు అంటూ కెప్టెన్ దాసూన్ షనక  చెప్పుకొచ్చాడు. కాగా 2021లో చెన్నై సూపర్ కింగ్స్.. కోల్కతా  నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన చెన్నై జట్టు మొదటి బ్యాటింగ్ చేసింది.. దీంతో ఓటమి ఖాయం అనుకున్న సమయంలో 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: