అందరూ ఎదురు చూస్తున్న ప్రపంచ కప్ లో సూపర్ 12 మ్యాచ్ లు నిన్నటి నుంచి ప్రారంభం అయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న జరిగిన రెండు మ్యాచ్ లు కూడా అటు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రేక్షకుల  అంచనాలను తారుమారు చేశాయి అని చెప్పాలి. ఇకపోతే ఎంతోమంది ఆటగాళ్లు రికార్డులు కూడా క్రియేట్ చేసి వరల్డ్ కప్ లో మళ్ళీ రికార్డుల వేట ప్రారంభించారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల సూపర్ 12 మ్యాచ్లలో భాగంగా ఆఫ్గనిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భాగంగా ఇంగ్లాండ్ ఫేసర్ సామ్ కరణ్ అద్భుతమైన ప్రతిభ కనబరిచి ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు.



 ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో 3.4 ఓవర్లు వేశాడు సామ్ కరణ్. ఈ క్రమంలోనే కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్ల హాల్ అందుకోవడం గమనార్హం. అయితే ఇలా అయిదు వికెట్లు తీయడం ద్వారా సామ్ కరణ్ ఒక అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి.. అంతర్జాతీయ టి20లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి ఇంగ్లాండు బౌలర్ గా సామ్ కరణ్ రికార్డులు సృష్టించాడు.. ఇక అంతకుముందు ఈ రికార్డ్ ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ పేరిట ఉండేది అని చెప్పాలి. 2021లో ఆదిల్ రషీద్ వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.


 ఇక ఇప్పటివరకు ఇవే అత్యుత్తమ గణాంకాలుగా కొనసాగుతున్నాయ్. ఇకపోతే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో సామ్ కరణ్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు అని చెప్పాలి.  ఇకపోతే మ్యాచ్ విషయానికి వస్తే ఆఫ్గనిస్తాన్ 112 పరుగులు చేయగా స్వల్ప టార్గెట్ తో బలిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఎంతో అలవోకగా టార్గెట్ చేదించి అటు టి20 వరల్డ్ కప్ లో తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది అని చెప్పాలి. ఇకపోతే నేడు ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న దాయాదుల పోరు జరగబోతుంది. మెల్బోర్న్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ వీక్షించేందుకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ సిద్ధమైపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: