ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసే హాఫ్ ఆఫ్ ఫేమ్ చోటు దక్కించుకోవాలని ఎంతోమంది మాజీ ఆటకాల్లు ఆశపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కేవలం కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే ఇలా హాఫ్ ఆఫ్ ఫేమ్ చోటు దక్కుతూ ఉంటుంది.  ఇకపోతే ఇటీవల ముగ్గురు దిగ్గజ ప్లేయర్స్ హాఫ్ ఆఫ్ ఫేమ్ చోటు దక్కించుకున్నారు. ఇందులో వెస్టిండీస్ దిగ్గజం శివ నారాయన్ చంద్రపాల్, పాకిస్తాన్ లెజెండరీ లెగ్ స్పిన్నర్  అబ్దుల్ ఖాదర్, ఇంగ్లాండ్ మహిళ క్రికెట్ దిగ్గజం చార్లెట్ ఎడ్ వర్డ్స్ ఉండడం గమనార్హం.


 శివ నారాయన్ చంద్రపాల్ : 1994లో వెస్టిండీస్ జాతీయ జట్టులో అరంగేట్రం   చేసిన చంద్రపాల్ 2016లో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 20 ఒకేళ్లపాటు వెస్టిండీస్ జట్టులో సేవలందించాడు. ఇక విండీస్ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా ఎంతగానో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు జింబాబ్వే కోచ్గా కొనసాగుతున్నాడు అని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మట్ లలో కలిపి 20,988 పరుగులు సాధించాడు. ఇప్పుడు ఐసీసీ హాఫ్ ఆఫ్ ఫేమ్ చోటు దక్కించుకున్నాడు.


 చార్లెట్ ఎడ్ వర్డ్స్ : 16 ఏళ్ళ వయసులోని మహిళా క్రికెట్ లో  అడుగు పెట్టిన చార్లెట్ ఇంగ్లాండ్ తరఫున 20 ఏళ్ల పాటు సేవలు అందించింది. ఇక తన అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టింది అని చెప్పాలి. ఇక 2009లో వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్ లను కెప్టెన్ గా ఇంగ్లాండ్ కు సాధించి పెట్టింది. ఇక ఇటీవలే ఐసీసీ విడుదల చేసిన హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకుంది.


 అబ్దుల్ ఖాదీర్ : పాకిస్తాన్ జట్టులో లెజెండ్రీ లెగ్ స్పిన్నర్  గా పేరు సంపాదించిన అబ్దుల్ ఖాదీర్ ఇటీవలే హాఫ్ ఆఫ్ ఫేమ్ లో చోటు సంపాదించుకున్నాడు. అయితే ఈయన 2019లోనే 63 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో చనిపోయారు. చనిపోయాక హాఫ్ ఆఫ్ ఫేమ్ చోటు దక్కడంపై ఆయన కొడుకు ఉస్మాన్ స్పందిస్తూ నా తండ్రికి అరుదైన గౌరవం ఇచ్చినందుకు ఐసీసీకి కృతజ్ఞతలు అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc