టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ల విధ్వంసానికి మారుపేరు అన్న విషయం తెలిసిందే. అటు ప్రేక్షకులకు కూడా టి20 ఫార్మాట్లో నచ్చేది ఇదే.. అందుకే ఊహించని రీతిలో నానాటికి అటు టి20 ఫార్మాట్ కి ప్రేక్షక ఆదరణ పెరిగిపోతూనే ఉంది అని చెప్పాలి. ఎన్ని రకాల దేశీయ లీగ్ లు తెర మీదకి వచ్చిన అన్ని సూపర్ హిట్ అవుతూ ఉండడం గమనార్హం. క్రీజు లోకి వచ్చిన బ్యాట్స్మెన్ కి ఎక్కువ సమయం, ఎక్కువ బంతులు ఉండవు కాబట్టి ఇక రావడం రావడమే సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోవాల్సి ఉంటుంది.


 ఈ క్రమంలోనే ఇక బ్యాట్స్మెన్లు కొట్టె అదిరిపోయే సిక్సర్లు అయితే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరిలో కూడా సరికొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాయి. ఇక అలాంటిది ఏకంగా టి20 వరల్డ్ కప్ లోనే సిక్సర్ల  మోత మోగిస్తే.. ఇక ఆటగాడికి సంబంధించిన పేరు కాస్త ప్రపంచవ్యాప్తంగా కూడా మారుమోగిపోతూ ఉంటుంది. ఇకపోతే ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమైన టి20 వరల్డ్ కప్ ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరిగింది. ఈ క్రమంలోనే టి20 వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు ఎవరు అన్న విషయం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే ఇలా పొట్టి వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన రికార్డు వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ పేరిట ఉంది. ఆ ఆటగాడు ఎవరో కాదు మార్లోన్ శాముల్స్. 2012 టి20 వరల్డ్ కప్ లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో శామ్యూల్స్ ఏకంగా ఆరు సిక్సర్లు కొట్టాడు. 56 పంతులు 78 పరుగులు చేశాడు.. ఇక 2012లో వెస్టిండీస్ జట్టు రెండవసారి టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది అని చెప్పాలి. కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర వహించిన శామ్యూల్స్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.


 ఇక ఇప్పటికీ కూడా వెస్టిండీస్ ఆల్ రౌండర్ శామ్యూల్స్ కొట్టిన ఆరు సిక్సర్లే ఇక టి20 వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక సిక్సర్లుగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక అతని తర్వాత ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల లిస్టులో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మిస్బా ఉల్ హక్ 2007, టీమిండియా బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 2014, వెస్టిండీస్ బ్యాట్స్మెన్ కార్లోస్ బ్రాత్ వైట్ 2016, ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్   2021 టీ20 ఫైనల్ నాలుగు సిక్సర్లు కొట్టిన ప్లేయర్లుగా కొనసాగుతున్నారు. ఇకపోతే ఇటీవల మెల్బోర్న్ స్టేడియం పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఉత్కంఠ భరితమైన పోరులో ఇంగ్లాండ్ జట్టు సమిష్టి కృషితో విజయం సాధించి రెండోసారి టి20 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: