ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా టి20 ఫార్మాట్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇక ఇప్పుడు సుదీర్ఘమైన ఫార్మాట్ గా పేరున్న టెస్ట్ ఫార్మాట్ కి గడ్డు పరిస్థితి ఏర్పడింది అని గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. టి20 ఫార్మాట్ వచ్చిన తర్వాత ఇక టెస్ట్ ఫార్మాట్ ఎవరు చూస్తారు అన్న వాదన కూడా వినిపించారు ఎంతో మంది మాజీ ఆటగాళ్లు. అంతేకాదు రానున్న రోజుల్లో ఇక టి20 ఫార్మాట్ కనుమరుగు అయ్యే పరిస్థితి కూడా ఉందని ఎంతోమంది అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలోనే క్రికెట్ లో ఎన్ని రకాల ఫార్మాట్లు వచ్చినప్పటికీ టెస్ట్ క్రికెట్ మాత్రం క్రికెట్ ఆటకి ఒక బ్రాండ్ అంటూ ఎంతో మంది చెబుతున్నారు.


 మాజీ ఆటగాళ్లు మాత్రమే కాదు ప్రస్తుత ఆటగాలు సైతం ఇదే విషయంపై ఇక పాజిటివ్ గా స్పందించారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్ల బ్యాటింగ్ చూసిన తర్వాత టెస్ట్ క్రికెట్ లోనే అసలైన మజా ఉంటుందని కొంతమంది మాజీ ప్లేయర్లు అభిప్రాయపడ్డారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలా టెస్ట్ ఫార్మాట్ అన్ని ఫార్మాట్లోకెల్లా బెటర్ అనే ప్లేయర్ల జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క  కూడా చేరిపోయాడు. ఇటీవల ఇంగ్లాండు తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో విజయం  అనంతరం మాట్లాడిన స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 తన కెరీర్ మొత్తంలో ఎప్పుడూ తన మొదటి ప్రాధాన్యత టెస్ట్ ఫార్మాట్ కే ఉంటుందని స్టార్క్ చెప్పుకొచ్చాడు. ఇక టెస్ట్ ఫార్మట్ తర్వాత వన్డే, టీ20 లు తన ప్రాధాన్యతలో ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే వన్డే లు టి20 కంటే టెస్ట్ ఫార్మాట్ ఎంతో ఉన్నతమైనది. మూడు ఫార్మాట్ లో ప్రతి మ్యాచ్ ఆడటం ఏ ఆటగాడికైనా అసాధ్యం. శరీరం సహకరించినంత వరకు వన్డేలు టీ20 లలో ఆడుతాను అంటూ మిచెల్ స్టార్క్ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం తీరికలేని షెడ్యూల్ కారణంగా స్టార్క్ టెస్ట్ ఫార్మాట్ కి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: