ఎన్నో ఏళ్ల నుంచి టీమిండియాలో స్టార్ స్పిన్నర్ గా కొనసాగుతున్నాడూ.యుజ్వేంద్ర చాహల్. తన స్పిన్ మాయాజాలంతో కీలక సమయంలో వికెట్లు పడగొట్టాడు. టీమిండియాకు విజయాన్ని అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. అంతేకాదు చాహల్ ఆడుతున్న తీరు పిట్ట కొంచెం కూత ఘనం అనే దానికి బాగా సరిపోతుంది. అతను చూడటానికి కాస్త బక్కపలుచగా ఉన్నప్పటికీ అతను వేసిన బంతులు మాత్రం బ్యాట్స్మెన్ లకు చమటలు పట్టిస్తూ ఉంటాయి. ఎవరికి ఏం లెన్త్ లో  వేస్తే వికెట్ తీయవచ్చు అన్న విషయం చాహల్ కి బాగా తెలుసు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రమే కాదు ఐపీఎల్ లో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు ఈ లెగ్ స్పిన్నర్.



 ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్తో ఆడుతున్న వన్డే సిరీస్లో కూడా చోటు దక్కించుకున్నాడు. గత కొంత కాలం నుంచి పేలవమైన ఫామ్ కనపరిచిన యుజ్వేంద్ర చాహల్ ఇక ఇప్పుడు మొదటి వన్డే మ్యాచ్ లో మాత్రం సత్తా చాటాడు.  మరో సారి వెస్టిండీస్తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో తన స్పిన్ తో మ్యాజిక్ చేసిన యుజ్వేంద్ర చాహల్ వరుసగా వికెట్లు తీస్తూ వెస్టిండీస్ ఆటగాళ్లను పెవిలియన్  ను పంపించాడు. అంతేకాదు  అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ స్పిన్నర్. అందరి బౌలింగ్ లో  బాగానే ఎదుర్కొన్న వెస్టిండీస్ బ్యాట్స్మెన్ లు అటు చాహల్ లెగ్ స్పిన్ ఎదుర్కోవడానికి ముప్పుతిప్పలు పడ్డారు.


 ఇటీవల జరిగిన మ్యాచ్లో పురాన్ వికెట్ తీయడం వల్ల ఇక వన్డే క్రికెట్ ఫార్మాట్లో 100 వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు  చాహల్. 61 మ్యాచ్ లలోనే ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఎన్నోసార్లు 5 వికెట్లు తీసిన రికార్డు సాధించిన చాహల్ ఇప్పుడు 100 వికెట్ల వీరుడిగా మారిపోయాడు. ఇక ఆ తర్వాత కిరణ్ పోలార్డ్ సహా మరో వికెట్ కూడా పడగొట్టి కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: