గుజరాత్ టైటాన్స్ ఇతనిని 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే ఇతని ప్లేస్ లో ఎవరిని తీసుకోవాలన్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లుంది. ఆఫ్గనిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ అయిన రహ్మనుల్లా గుర్బాజ్ ను తీసుకోవడానికి గుజరాత్ టైటాన్స్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ వేలంలోకి 50 లక్షల కనీస ధరతో ఇతను రిజిస్టర్ చేసుకోగా, వేలంలో పాల్గొన్న 10 జట్లలో ఎవ్వరూ కూడా ఇతనిని కొనడానికి ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు ఇతనిని కనీస ధరకు దక్కించుకోవడానికి గుజరాత్ టైటాన్స్ బీసీసీఐ కి పంపిందట. అయితే బీసీసీఐ నుండి కన్ఫర్మేషన్ వచ్చే వరకు గుజరాత్ టైటాన్స్ వెయిట్ చేయాల్సి ఉంది.
కాగా ఇప్పటికే గుజరాత్ జట్టులో ఆఫ్గనిస్తాన్ నుండి రషీద్ ఖాన్ మరియు నూర్ అహ్మద్ లు ఉన్నారు. ఈ అవకాశం రహ్మనుల్లాకు దక్కితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. ఇతను ఆఫ్ఘన్ జట్టులోకి వచ్చి కొంతకాలమే అయినా అప్పుడే జట్టులో ఒక కీలక ప్లేయర్ గా ఎదిగాడు. ఇతను క్రీజులో ఉన్నంత సేపు బౌలర్ కు చుక్కలే... వీరేంద్ర సెహ్వాగ్ లెక్క మొదటి బంతి నుండి ఒకటే బాదుడు. ఇతను గుజరాత్ జట్టులోకి వస్తే పెద్ద ప్లస్ అవుతుంది. మరి చూద్దాం బీసీసీఐ ఏమంటుందో?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి