గత కొంత కాలం నుంచి టీమిండియా ఓటమి గెలుపు లపై ఎవరు స్పందించడం లేదు. కానీ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ పై ప్రతి ఒక్కరూ స్పందిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అప్పుడు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు గా వెలుగొందిన విరాట్ కోహ్లీ ప్రస్తుత కాలంలో పేలవమైన ఫామ్ లో సరిగా పరుగులు చేయడానికి కూడా తెగ ఇబ్బంది పడి పోతున్నాడు. ఇలాంటి సమయంలోనే విరాట్ కోహ్లీకి కొన్నాళ్ళ పాటు రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు.  అంతేకాకుండా విరాట్ కోహ్లీని జట్టు నుంచి తప్పించాలి అంటూ మరి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 అయితే మొన్నటి వరకు విరాట్ కోహ్లీ ఫామ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న వారి సంఖ్య పెరిగి పోతూ ఉంటే.. ఇటీవలి కాలంలో మాత్రం దిగ్గజ ఆటగాడు కోహ్లీ కి మద్దతుగా నిలుస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇటీవలే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కోహ్లీ ఫాంపై అనుకూలంగా స్పందిస్తు  మద్దతుగా నిలిచాడు. ఇక రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ సైతం అతనికి అండగా నిలిచారు. ఇప్పుడు విదేశీ క్రికెటర్లు సైతం కోహ్లీ కి మద్దతుగా నిలుస్తున్నారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే భారత్కు దాయాది దేశమైన పాకిస్థాన్ కి పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న బాబర్ అజాం కోహ్లీ ఫామ్ పై స్పందించాడు.

 ఈ క్రమంలోనే కోహ్లీ కి మద్దతుగా నిలిచాడు. కోహ్లీ కూడా అందరిలాగా ఒక సాధారణ మనిషేనని.. తనదైన రోజు చెలరేగి ఆడుతాడు అని బాబర్ అజాం అండగా నిలిచాడు. అయితే ఇటీవల కాలంలో కోహ్లీ రికార్డు లను వరుసగా బద్దలుకొడుతున్న బాబర్ సైతం కోహ్లీకి మద్దతుగా నిలవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. కోహ్లీతో ఉన్న ఫోటో షేర్ చేసి.. ఈ కష్ట కాలం కరిగిపోతుంది.. ధైర్యంగా ఉండు అంటూ ఒక పోస్టు పెట్టాడు.. ఇలా రోజురోజుకీ కోహ్లీకి మద్దతు పెరిగిపోతుంది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: