లండన్‌లో జరిగిన స్పోర్ట్ బిజినెస్ సమ్మిట్‌ లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సభ్యురాలు నీతా అంబానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె 'ఇన్ స్పైరింగ్ ఎ బిలియన్ డ్రీం: ది ఇండియా ఆపర్చునిటీ' అంశంపై తన అభిప్రాయాలను తెలిపారు. ఆమె ప్రసంగంలో ముందుగా ప్రపంచంలోనే క్రీడా నిపుణులు, భాగస్వామ్య సంస్థలకు ఆమె అభివాదం తెలుపుతూ.


భారత్ అన్ని రంగాల్లో రాణిస్తోందని, ప్రత్యేకంగా క్రీడా రంగంలో కూడా చక్కటి పురోగతి సాధిస్తోందని ఆమె తెలిపారు.ఈ సందర్భంగా ఆమె ఐపీఎల్ విజయవంతం కావడం వల్లే దేశంలో మరెన్నో క్రీడలు కూడా లీగ్ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చాయని నీతా అంబానీ తెలిపారు. హాకీ, బాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్ బాల్, రెజ్లింగ్, కబడ్డీ, అలాగే ఫుట్ బాల్ వంటి క్రీడలు ప్రైవేటు లీగ్స్ ద్వారా క్రీడాభిమానుల ఆదరణ పొందుతున్నాయని నీతా అంబానీ తెలియచేసారు. 


అంతేకాదు..విదేశాల్లో నిర్వహించే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ చూసేందుకు భారత్ లో సైతం మధ్య రాత్రి నిద్రలేచి చూసే ఆదరణ పొందింది. అప్పుడే భవిష్యత్తులో ఫుట్ బాల్ పట్ల యువత విపరీతంగా ఆకర్షితులవుతున్నారని గమనించినట్లు ఆమె అన్నారు. భారత్ లో ఫుట్ బాల్ విస్తరణకు చక్కటి అవకాశం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ ఆవిష్కరణకు పురిగొల్పినట్లు నీతా తన అనుభవాలను తెలిపారు. గడిచిన 5 సంవత్సరాల్లో మూడో అతిపెద్ద వ్యూయర్ షిప్ కలిగిన లీగ్ గా ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ అవతరించిందని ఆమె తెలిపారు.


అంతేకాదు ఈ సందర్భంగా టీమిండియా టాప్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఆమె ప్రసంగించారు. బూమ్రా వంటి యంగ్ ఆటగాళ్లను ఎందరినో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ప్రపంచానికి పరిచయం చేసిందన్నారు. టాలెంట్ అనేది  ఎప్పుడైన వస్తుందన్నారు. జస్పీత్ బుమ్రా ఎలా క్రికెట్‌లో అడుగుపెట్టాడన్న దానిపై నీతా అంబాని ఓ డాక్యమెంటరీ ద్వారా సదస్సుకు హాజరైన వారికి చూపించారు. జస్ప్రిత్ బుమ్రా ఐదేళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: