విద్యార్థులకు చాలా కష్టమైన సబ్జెక్టు ఏదంటే కచ్చితంగా గణిత సమస్యలను చెబుతారు.. వీటిని పరిష్కరించడానికి ఎలా కష్టపడతారో చెప్పాల్సిన పనిలేదు.. కొన్ని లెక్కలకు సమాధానాలు దొరకగా చాలా సతమతమవుతూ ఉంటారు. అయితే తాజాగా గూగుల్ విద్యార్థులకు గణిత సమస్యలకు చెక్ పెట్టే విధంగా ఒక పరిష్కారాన్ని చూపించింది.. ఫోటో మాథ్స్ యాప్ ను లాంచ్ చేసింది.. దీని ద్వారా ఏదైనా గణిత ప్రశ్నకు ఒక ఫోటో తీస్తే చాలు క్షణాల లో ఆన్సర్ వచ్చేస్తుందట.. గణితంలో చాలా కష్టమైన త్రికోణమితి లేదంటే బీజగణిత సమీకరణాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు నైనా సరే ఈ యాప్ ద్వారా సులువుగా సమాధానాలను మనం తెలుసుకోవచ్చు.


ఫోటో మాథ్స్ యాప్ ఒక స్మార్ట్ కెమెరా క్వాలిక్యులేటర్, మాథ్స్ అసిస్టెంట్ యాప్ అని కూడా చెప్పవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లో ప్రస్తుతం ఈ యాప్ అందరికీ అందుబాటులో ఉంది.. ఏదైనా ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఒక ఫోటో తీస్తే చాలు ఆ సమస్యను సైతం పరిష్కరించే దిశగా వివరణ కూడా అందిస్తుంది. ఈ కొత్త యాప్ ఇంటిగ్రేషన్ తో పాటు గూగుల్ తన ఎడ్యుకేషన్ పోర్టు పోలియోను కూడా వివరిస్తుందట.. ఈ యాప్ ద్వారా విద్యార్థులు సులభంగా గణితాన్ని సైతం నేర్చుకోవచ్చు.

మరి ఈ యాప్ ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ లో..IOS పరికరాలలో యాపిల్ స్టోర్ లో కూడా మాథ్స్ యాప్ సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.. అయితే యాప్ తెరిచి అందులో ఉన్న కెమెరా సహాయంతో మనం ప్రశ్న కెమెరా గా తీయాలి.. లేకపోతే మ్యానువల్ గా ఆయన టైప్ చేయవచ్చు.. క్షణాలలో మీ ప్రశ్నకు సంబంధించి స్కాన్ చేసి మరి సరైన సమాధానాన్ని అందిస్తుంది. ఈ యాప్ లో.. త్రికోణమితి, బీజగణితం, జ్ఞ్యామితి, క్యాలిక్యులేస్, గుణాంకాలతో పాటు  వివిధ గణిత సమస్యలను కూడా పరిష్కరిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: