భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గెలుపు లాంఛ‌న‌మే. కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ విజ‌యానికి కావ‌ల్సిన ఓట్లు ఇప్పటికే వచ్చేశాయి. ఈ విషయమై మమతా బెనర్జీ స్పందిస్తూ ‘‘నందిగ్రామ్ కుట్రకు భవానీపూర్ గట్టి సమాధానం చెప్పింది’’ అని దీదీ వ్యాఖ్యానించారు. దేశంలోని తల్లులకు, సోదర సోదరీమణులందరికీ కృతజ్ణతలు తెలియజేస్తున్నాను. కొన్ని వార్డుల్లో 2016లో మాకు అనుకూలంగా ఓట్లు వచ్చాయి. భవానీపూర్‌లో 46 శాతం బెంగాల్‌కు చెందని వారే ఉన్న‌ప్ప‌టికీ ప్రతి ఒక్కరు నాకు ఓటు వేశారు. ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి మమ్మల్ని అధికారం నుంచి తప్పించడానికి కేంద్రం కుట్రలకు పాల్పడుతోంది. నా కాలికి గాయమైనా మాపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఆనందంగా, గర్వంగా ఉంది. ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల కమిషన్‌కు కృతజ్ణతలు’’ తెలియ‌జేసుకుంటున్నాను అని మమతా బెనర్జీ అన్నారు. 2016లో భవానీపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్‌మున్సి భార్య దీపా దాస్‌మున్సీ చేతిలో 25,301 ఓట్ల తేడాతో మమతా బెనర్జీ ఓట‌మిపాల‌య్యారు. త‌ర్వాత ఆరునెల‌ల క్రితం జ‌రిగిన ఎన్నిక‌ల్లో 1600 ఓట్ల తేడాతో నందిగ్రామ్‌లో సువేందు చేతిలో ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: